బ్రిస్బేన్ హీట్ తరఫున ఆడనున్న పూనమ్ యాదవ్

దిశ, స్పోర్ట్స్: భారత మహిళా క్రికెట్ జట్టు స్పిన్నర్ పూనమ్ యాదవ్ ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో బ్రిస్బేన్ హీట్ తరఫున ఆడనున్నది. ఈ మేరకు ఆమెతో ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకున్నది. బ్రిస్బేన్ హీట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూజీలాండ్ స్టార్ ప్లేయర్ అమిలా కెర్ లీగ్ నుంచి తప్పుకోవడంలో ఆమె స్థానంలో పూనమ్ యాదవ్‌ను తీసుకున్నారు. పూనమ్ యాదవ్ టీమ్ ఇండియా తరఫున 54 టెస్టులు, 71 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన […]

Update: 2021-10-08 10:27 GMT

దిశ, స్పోర్ట్స్: భారత మహిళా క్రికెట్ జట్టు స్పిన్నర్ పూనమ్ యాదవ్ ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో బ్రిస్బేన్ హీట్ తరఫున ఆడనున్నది. ఈ మేరకు ఆమెతో ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకున్నది. బ్రిస్బేన్ హీట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూజీలాండ్ స్టార్ ప్లేయర్ అమిలా కెర్ లీగ్ నుంచి తప్పుకోవడంలో ఆమె స్థానంలో పూనమ్ యాదవ్‌ను తీసుకున్నారు. పూనమ్ యాదవ్ టీమ్ ఇండియా తరఫున 54 టెస్టులు, 71 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా రెండు మ్యాచ్‌లు ఆడిన పూనమ్ మంచి ప్రదర్శన చేసింది. ఇప్పటికే టీమ్ ఇండియాకు చెందిన షెఫలీ వర్మ, రాధాయాదవ్, స్మృతి మంధాన, దీప్తి శర్మ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్‌లు డబ్ల్యూబీబీఎల్‌లో పలు ఫ్రాంచైజీల తరఫున ఆడుతున్నారు. తాజాగా ఆ లీగ్‌లో చేరిన ఎనిమిదవ భారత క్రికెటర్‌గా పూనమ్ యాదవ్ నిలిచింది.

Tags:    

Similar News