కరోనా పేషెంట్ల కోసం బుట్టబొమ్మ స్పెషల్ వీడియో

దిశ, సినిమా: బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ మధ్యే కొవిడ్ నుంచి రికవరీ అయింది. ఈ క్రమంలో కరోనా పాజిటివ్ రాకముందు పల్స్ ఆక్సిమీటర్ ఎలా వాడాలో తెలియదని చెప్పింది. చాలా మందికి కూడా ఈ ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో ఆక్సిమీటర్‌ను సరైన మార్గంలో వినియోగించే విధానంపై వివరించింది. స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్ ఇస్తూ ఇన్‌ఫర్మేటివ్ వీడియోను షేర్ చేసింది. ఆక్సిజన్ లెవల్స్‌ను పరీక్షించుకునేందుకు కరోనా పేషెంట్స్‌ ఈ సూచనలను పరిగణించాల్సిన అవసరముందని వెల్లడించింది. తాను […]

Update: 2021-05-14 06:10 GMT

దిశ, సినిమా: బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ మధ్యే కొవిడ్ నుంచి రికవరీ అయింది. ఈ క్రమంలో కరోనా పాజిటివ్ రాకముందు పల్స్ ఆక్సిమీటర్ ఎలా వాడాలో తెలియదని చెప్పింది. చాలా మందికి కూడా ఈ ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో ఆక్సిమీటర్‌ను సరైన మార్గంలో వినియోగించే విధానంపై వివరించింది. స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్ ఇస్తూ ఇన్‌ఫర్మేటివ్ వీడియోను షేర్ చేసింది. ఆక్సిజన్ లెవల్స్‌ను పరీక్షించుకునేందుకు కరోనా పేషెంట్స్‌ ఈ సూచనలను పరిగణించాల్సిన అవసరముందని వెల్లడించింది. తాను క్వారంటైన్‌లో ఉన్న సమయంలో ఆక్సిజన్ లెవల్స్ క్లోజ్‌గా మానిటర్ చేయాలని వైద్యులు సూచించారని తెలిపింది. తన డాక్టర్ చెప్పే వరకు కూడా ఆక్సిమీటర్‌ను ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదని.. కరోనాతో పోరాడేందుకు చేస్తున్న తమ ప్రయత్నాల్లో ఏది కూడా చిన్నది కాదన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పింది పూజ.

Tags:    

Similar News