పవర్ స్టార్‌కు జోడీగా బుట్ట బొమ్మ?
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లలో పూజా హెగ్డే హవా నడుస్తోంది. ‘అల వైకుంఠపురం’లో సినిమాకు కూడా పూజ హిట్ ట్రాక్‌లోనే ఉన్నప్పటికీ.. ఆ సినిమాతోనే బుట్ట బొమ్మగా వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించిందన్నది నిజం. దీంతో ఈ భామకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధే శ్యామ్’ చిత్రాల్లో నటిస్తుండగా.. మరిన్ని ప్రాజెక్ట్‌లు సైన్ చేసే దశలో ఉన్నాయి. ఈ క్రమంలో ‘గబ్బర్ సింగ్’ డైరెక్టర్ హరీష్ శంకర్ నెక్స్ట్ సినిమాలోనూ తనకు […]
దిశ, వెబ్‌డెస్క్:
ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లలో పూజా హెగ్డే హవా నడుస్తోంది. ‘అల వైకుంఠపురం’లో సినిమాకు కూడా పూజ హిట్ ట్రాక్‌లోనే ఉన్నప్పటికీ.. ఆ సినిమాతోనే బుట్ట బొమ్మగా వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించిందన్నది నిజం. దీంతో ఈ భామకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధే శ్యామ్’ చిత్రాల్లో నటిస్తుండగా.. మరిన్ని ప్రాజెక్ట్‌లు సైన్ చేసే దశలో ఉన్నాయి.
ఈ క్రమంలో ‘గబ్బర్ సింగ్’ డైరెక్టర్ హరీష్ శంకర్ నెక్స్ట్ సినిమాలోనూ తనకు చాన్స్ వచ్చిందని టాలీవుడ్ టాక్. హరీష్.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో తీయబోయే సినిమాలో అవకాశం కొట్టేసిందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ కాగా, హీరోయిన్‌గా పూజనే తీసుకోవాలని హరీష్ ఫిక్స్ అయినట్టు సమాచారం. కాగా ‘గద్దలకొండ గణేష్’ సినిమా థాంక్స్ మీట్‌లో పూజపై ప్రశంసల వర్షం కురిపించిన హరీష్ శంకర్.. తప్పకుండా తనతో మళ్లీ వర్క్ చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అందుకే పవర్ స్టార్ సినిమా చాన్స్ ఇస్తున్నాడని ఇండస్ట్రీ టాక్.