చిరు సినిమాలో మహేష్ జోడీకై సెర్చ్
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న విషయం తెలిసిందే. ‘ఆచార్య’ టైటిల్ ఆల్మోస్ట్ కన్‌ఫాం కాగా… సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథి పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ విషయం మూవీ యూనిట్ త్వరలోనే ప్రకటిస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. ముప్పై నిమిషాల నిడివి ఉన్న నక్సలైట్ పాత్రలో కనిపించబోతోన్న మహేష్ ఈ సినిమా కోసం రూ. 32 కోట్లు తీసుకుంటున్నాడట. కాగా… మహేష్ 30 రోజులు షూటింగ్‌లో పాల్గొనే అవకాశం […]
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న విషయం తెలిసిందే. ‘ఆచార్య’ టైటిల్ ఆల్మోస్ట్ కన్‌ఫాం కాగా… సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథి పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ విషయం మూవీ యూనిట్ త్వరలోనే ప్రకటిస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. ముప్పై నిమిషాల నిడివి ఉన్న నక్సలైట్ పాత్రలో కనిపించబోతోన్న మహేష్ ఈ సినిమా కోసం రూ. 32 కోట్లు తీసుకుంటున్నాడట. కాగా… మహేష్ 30 రోజులు షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండగా .. ప్రిన్స్‌కు రెండు సాంగ్‌లు, రెండు ఫైట్ సీక్వెన్స్ డిజైన్ చేయనున్నారట డైరెక్టర్. రెండు పాటల్లో ఒకటి డ్యూయట్ కాగా… మరొకటి ఇన్సిపిరేషన్ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మహేష్‌కు జోడిగా పూజా హెగ్డే , సాయి పల్లవిల పేర్లు పరిశీలనలో ఉన్నాయట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో మహేష్ కనిపించనుండగా… ఆచార్య మూవీ దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యంలో సాగుతుందని టాక్.