పరారీలో ఎమ్మెల్యే రమేష్ బాబు.. చర్యలు తీసుకోండి: పొన్నం

దిశ, వేములవాడ: పల్లె ప్రగతిలో సక్కగా పనిచేయని సర్పంచ్, కార్యదర్శుల పై చర్యలు తీసుకునే సీఎం కేసీఆర్ ఏకంగా ఏడాదిగా ప్రజలకు అందుబాటులో లేకుండా పరారీలో ఉన్న ఎమ్మెల్యే రమేష్ బాబుపై చర్యలు తీసుకోవడం లేదని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. ఎమ్మెల్యే నివాసం ఉంటున్న సేవ్స్ గెస్ట్ హౌస్ ముట్టడి కార్యక్రమం శనివారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. కరీంనగర్ మాజీ […]

Update: 2021-03-20 07:09 GMT

దిశ, వేములవాడ: పల్లె ప్రగతిలో సక్కగా పనిచేయని సర్పంచ్, కార్యదర్శుల పై చర్యలు తీసుకునే సీఎం కేసీఆర్ ఏకంగా ఏడాదిగా ప్రజలకు అందుబాటులో లేకుండా పరారీలో ఉన్న ఎమ్మెల్యే రమేష్ బాబుపై చర్యలు తీసుకోవడం లేదని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. ఎమ్మెల్యే నివాసం ఉంటున్న సేవ్స్ గెస్ట్ హౌస్ ముట్టడి కార్యక్రమం శనివారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు.

కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వేములవాడలోని ఆది శ్రీనివాస్ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సర్పంచ్‌లు, కౌన్సిలర్లు పనిచేయకపోతే సస్పెండ్ చేస్తున్నారనీ, అదే ఒక ఎమ్యెల్యే పై చర్యలు ఉండవా? అని సూటిగా ప్రశ్నించారు. జర్మనీ నుంచి రమేష్ బాబు ఇండియాకి వస్తే రెండు పాస్ పోర్ట్‌లు ఉన్నాయని, లుకౌట్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తారనే భయంతోనే రావడం లేదన్నారు. నెలకు రూ.లక్షల జీతం తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా జర్మనీకి పారిపోయిన ఎమ్యెల్యే రమేష్ బాబుపై శాశన సభలోనే చర్చించాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ వేములవాడ ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు రమేష్ బాబు ఆలయం ముందు కుర్చేసుకుని కుసుండి, అభివృద్ధి చేస్తాడని ప్రజలను నమ్మబలికించి, తీరా కరోనా కాలంలో లాక్ డౌన్ కంటే ముందుగా జర్మనీకి పోయిన ఎమ్మెల్యే ఇప్పటివరకు నియోజకవర్గానికి రాకుండా, అక్కడి నుంచే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్ లైన్ పాలనా చేస్తున్నాడని దుయ్యబట్టారు. రమేష్ బాబును సీఎం కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయించి, బై ఎలక్షన్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈనెల 23 తేదీ లోపు ఇండియాకి రాకపోతే కాంగ్రెస్ తరఫున చలో అసెంబ్లీకి పిలుపునిస్తామన్నారు.

సిరిసిల్ల ఎగువ మానేరు ఎప్పుడో పూర్తి చేస్తానన్నమంత్రి కేటీఆర్, నేటి వరకు అలాగే ఉందని ఎద్దేవాచేశారు. అర్ధరాత్రి కాంగ్రెస్ నేతలను సంసారాలు చేయకుండా రాత్రికిరాత్రే పోలీసులు అరెస్ట్ చేయడం శోచనీయమన్నారు. 23న ఎమ్మెల్యే రమేష్ బాబు ఇండియాకు రాకుంటే 24న అసెంబ్లీనీ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆది శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్, జడ్పీటీసీ నాగం కుమార్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, మండల, అర్బన్ అధ్యక్షుడు పిల్లి కనకయ్య, వకుళాభరణం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News