ఎమ్మెల్సీ పోరుకు సర్వం సిద్ధం 8 కేంద్రాల్లో జరగనున్న పోలింగ్..
దిశ ప్రతినిధి, నల్లగొండ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సర్వం సిద్ధమయ్యింది. గురువారం ఆయా జిల్లా కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి పోలింగ్ సామగ్రిని సిబ్బందికి అందజేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 1271 ఓట్లు ఉండగా, ఇందులో పురుష ఓటర్లు 553 కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 718 ఉన్నాయి. నల్లగొండ కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సర్వం సిద్ధమయ్యింది. గురువారం ఆయా జిల్లా కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి పోలింగ్ సామగ్రిని సిబ్బందికి అందజేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 1271 ఓట్లు ఉండగా, ఇందులో పురుష ఓటర్లు 553 కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 718 ఉన్నాయి. నల్లగొండ కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి చంద్రశేఖర్, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు. అటు సూర్యాపేట కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, యాదాద్రి కలెక్టరేట్‌లో కలెక్టర్ పమేలా సత్పతి పోలింగ్ సామగ్రిని అందజేశారు.
గురువారం సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల పరిశీలకులు మహమ్మద్ నదీమ్ పర్యవేక్షణలో పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇకపోతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8 డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ జరుగనుంది. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, కోదాడ, హుజుర్ నగర్, భువనగిరి, చౌటుప్పల్ డివిజన్లలో పోలింగ్ జరగనుంది. అనంతరం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహిళ ప్రాంగణంలోని డీఆర్డీఏ భవనంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కి బ్యాలెట్ బాక్స్‌లు చేరుకుంటాయి. ఈనెల 14న డీఆర్డీఏ భవనంలోనే కౌంటింగ్ నిర్వహించనున్నారు.
పోలింగ్ కేంద్రాల జాబితా ఇది..
పోలింగ్ కేంద్రం పురుష ఓటర్లు మహిళలు మొత్తం ఓట్లు
భువనగిరి 91 106 197
చౌటుప్పల్ 50 56 106
నల్లగొండ 108 127 235
దేవరకొండ 59 81 140
మిర్యాలగూడ 79 112 191
హుజూర్‌నగర్ 58 65 123
కోదాడ 36 57 93
సూర్యాపేట 72 114 186
మొత్తం 553 718 1271