పోలింగ్ ప్రశాంతంగా జరగాలి..
దిశ, ఖమ్మం టౌన్ : శాంతియుత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు క్షేత్రస్ధాయిలో దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతీ ఒక్కరూ నిబద్ధతతో కష్టపడి పనిచేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ […]
దిశ, ఖమ్మం టౌన్ : శాంతియుత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు క్షేత్రస్ధాయిలో దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతీ ఒక్కరూ నిబద్ధతతో కష్టపడి పనిచేయాలని పోలీసు అధికారులకు సూచించారు.
ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రజలు గుంపులు గుంపులుగా చేరకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఓటర్లు ఆందోళన చేందకుండా ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా స్వేచ్చయుత వాతావరణం కల్పించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ మురళీధర్, ఏఎస్పీ స్నేహ మెహ్రా, రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి, ఎస్బీ ఏసీపీ ప్రసన్న కుమార్, రూరల్ సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సై రాము పాల్గొన్నారు.