హుజురాబాద్‌లో పోలింగ్ ప్రారంభం.. అక్కడ మొరాయించిన EVM

దిశ, వెబ్‌డెస్క్ : హుజురాబాద్‌లో శనివారం ఉదయం 7 గంటలకు ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. హుజురాబాద్‌లో మొత్తం 2 లక్షల 37వేల 36 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఓటు వేసేందుకు ఓటర్లు తమ వెంట గుర్తింపు కార్డు తెచ్చుకోవడం తప్పనిసరి. అయితే.. పోలింగ్ సమయం చివరి గంటలో కరోనా పేషెంట్లకు ఓటు వేసేందుకు అధికారులు వారికి అవకాశం ఇచ్చారు. […]

Update: 2021-10-29 20:30 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హుజురాబాద్‌లో శనివారం ఉదయం 7 గంటలకు ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. హుజురాబాద్‌లో మొత్తం 2 లక్షల 37వేల 36 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఓటు వేసేందుకు ఓటర్లు తమ వెంట గుర్తింపు కార్డు తెచ్చుకోవడం తప్పనిసరి. అయితే.. పోలింగ్ సమయం చివరి గంటలో కరోనా పేషెంట్లకు ఓటు వేసేందుకు అధికారులు వారికి అవకాశం ఇచ్చారు.

పోలింగ్ విధుల్లో 1750 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం పోలింగ్ ప్రక్రియలో భాగంగా ఇల్లందకుంట బూత్ నెం.224లో ఈవీఎం మొరాయించింది. దీంతో అధికారులు ఈవీఎంను పరిశీలిస్తున్నారు. అక్కడ ఇంకా పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఉప ఎన్నికల పోటీలో 30 మంది అభ్యర్థులు నిలిచిన విషయం తెలిసిందే. ఇక, పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

 

Tags:    

Similar News