AP politics: టీడీపీ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి.
దిశ నరసరావుపేట: రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా అధికార పార్టీకి, టీడీపీకి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. అధికారులు ఎన్ని సార్లు హెచ్చరించినా వైసీపీ తన పంథాను మార్చుకోవడంలేదు. ఎన్నికల కోడ్ నిబంధనలను తుంగలో తొక్కి కవ్వింపు చర్యలకు దిగుతూ విపక్షాలతో కయ్యానికి కాలు దువ్వుతోంది.
తాజాగా నరసరావుపేట మండలం, ఉప్పలపాడులో వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగారు. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ సభ్యులు చేపట్టిన ప్రచారాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నరసరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయులు,డా౹౹చదలవాడ అరవింద్ బాబు ప్రచారం నిర్వహించాలి అని అనుకున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ప్రచార రథం పై ప్రచారం చేసేందుకు సిద్ధమైయ్యారు.
అయితే గ్రామంలో ప్రచారం చేయకూడదని వైసీపీ జెండాలు ఊపుతూ వైసీపీ కార్యకర్తలు టీడీపీ ప్రచారానికి అడ్డుపడ్డారు. అంతటితో ఆగకుండా ప్రచార రథంపై ఉన్న టీడీపీ నేతలపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అయితే ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు ఆటకం వాటిల్లకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ గొడవ ముదరకుండా పోలీసులు జోక్యం చేసుకుని, వివాదాన్ని సర్దుమణిగెలా చేశారు. అనంతరం టీడీపీ ప్రచారం కొనసాగింది.