బీఆర్ఎస్ లోనే కొనసాగుతా : వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి
తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత వనపర్తి మొదటి జడ్పీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినందువల్ల మంత్రి నిరంజన్ రెడ్డి సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపి ఆదర్శవంతమైన జడ్పీ పాలకవర్గం అన్న పేరును తీసుకొస్తానని వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి తెలిపారు.
దిశ, వనపర్తి ప్రతినిధి: తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత వనపర్తి మొదటి జడ్పీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినందువల్ల మంత్రి నిరంజన్ రెడ్డి సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపి ఆదర్శవంతమైన జడ్పీ పాలకవర్గం అన్న పేరును తీసుకొస్తానని వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన తన చాంబర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమాచార లోపం వల్ల మంత్రి నిరంజన్ రెడ్డికి తనకు గ్యాప్ ఏర్పడిందని, అందువల్ల తాను రెండు నెలల క్రితం బీఆర్ఎస్ కు రాజీనామా చేయడం జరిగిందని, అప్పటినుంచి ఏ ఇతర రాజకీయ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉన్నానని ఆయన అన్నారు.
వనపర్తి జడ్పీ తొలి పాలకవర్గాన్ని ఆదర్శవంతంగా నిలబెడదామని సహచర జడ్పీటీసీ సభ్యులందరి కోరిక మేరకు బీఆర్ఎస్ నాయకులు మిత్రులతో జరిగిన చర్చలతో కేవలం సమాచార లోపం వల్లే తమకు విభేదాలు తలెత్తడం జరిగిందని గుర్తించామన్నారు. అందుకోసం వీటన్నింటిని పక్కకు పెట్టి ఎప్పటికీ పార్టీలోనే ఉంటూ మంత్రి సహకారంతో జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. తాను పార్టీకి రాజీనామా చేసిన ఈ రెండు నెలల్లో ఏ ఒక్కరోజు పార్టీనిగానీ మంత్రి నిరంజన్ రెడ్డిని గాని ఎక్కడ విమర్శించలేదని ఆయన గుర్తు చేశారు. ఇకనుంచి బీఆర్ఎస్ లోనే సంపూర్ణంగా కొనసాగుతానని జడ్పీ చైర్మన్ లోక నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, బీఆర్ఎస్ నాయకులు కోటేశ్వర్ రెడ్డి, ఎర్ర శీను, నందిమల్ల శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.