TDP: వల్లభనేనిపై దాడి చేసింది వీళ్లే.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
యథా రాజా తథా ప్రజా అన్నట్టుంది వైసీపీ నేతల తీరు.
దిశ వెబ్ డెస్క్: యథా రాజా తథా ప్రజా అన్నట్టుంది వైసీపీ నేతల తీరు. మాజీ ముఖ్యమంత్రి తానా అంటే, ఆయన అనుచరులు తందాన అంటు వంత పాడుతున్నారు. ఇందుకు ఎక్కడ ఏం జరిగినా అందుకు కారణం టీడీపీనే అని వైసీపీ అధినేత ఆరోపించడం, అందుకు ఆయన అనుచరగణం వంతపాడడమే నిదర్శనం అని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో కూటమి అఖండ విజయం సాధించింది అని తెలిసిన క్షణం నుండి జగన్మోహన్ రెడ్డితోపాటు పార్టీ నేతలు సైతం టీడీపీపై ఆరోపణల జల్లు కురిపిస్తున్నారు.
రాష్ట్రంలో పలు చోట్ల చోటు చేసుకుంటున్న ఉద్రిక్తలకు, ఘర్షణలకు, నేతలపై జరుగుతున్న దాడులకు కారణం టీడీపీ అని వైసీపీ ద్వజమెత్తుతోంది. అయితే తాజాగా ఆ ఆరోపణలపై టీడీపీ X వేదికగా స్పందించింది. టీడీపీ పై వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ముఖ్యంగా వల్లభనేని వంశీపై టీడీపీ గూండాలు దాడి చేశారని వైసీపీ చేసిన ఆరోపణలు అవాస్తవం అని కొట్టిపారేసింది. వాస్తవానికి వల్లభనేని వంశీ తన బినామీలతో నడిపించి బోర్డు తిప్పేసిన సంకల్పసిద్ధి స్కీంలో చేరి మోసపోయిన బాధితులంతా, ఆయన ఇంటి ముందు నిరసనకు దిగారని.. ఈ నేపథ్యంలో ఇంటి లోపలి నుంచి వంశీ రౌడీమూకలు సంకల్పసిద్ధి బాధితులపై రాళ్లు రువ్వారని, దీనితో కడుపుమండిన బాధితులు తిరిగి రాళ్ల దాడి చేశారని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చింది.