AP Politics: టీడీపీVs జనసేన.. ఆధిపత్య పోరులో వాస్తవమెంత..?

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వెలువడి 2024 ఎన్నికల ఫలితాల్లో కూటమి అఖండ విజయం సాధించగా, వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

Update: 2024-06-09 10:51 GMT

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వెలువడి 2024 ఎన్నికల ఫలితాల్లో కూటమి అఖండ విజయం సాధించగా, వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే గత ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజలు ఈ ఎన్ని్కల్లో ఎందుకు తమ పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారు..? ప్రజలను నొప్పించేలా ఏ తప్పు చేశాం అనేదాని గురించి ఆలోచించి, జరిగిన తప్పును సరిదిద్దుకునేందు యత్నించకుండా, టీడీపీ, జనసేనను టార్గెట్ చేసి, అవాస్తవాలను వాస్తవాలు అని నమ్మించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని, కుక్కతోక వంకర అన్నట్టు వైసీపీ తీరు మారదని వైసీపీపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అల్లర్లు మీవే.. ఆరోపణలు మీవే..

ఇటు మీడీయా, అటు సోషల్ మీడియాలో టీడీపీ, జనసేనపై నిత్యం ఏదో ఒక ఆరోపణ చేస్తూనే ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోపాటు పార్టీనేతలు. టీడీపీ, జనసేనపై సోషల్ మీడియా వేదికగా వైసీపీ చేస్తున్న పోస్టులపై నెటిజన్స్ మండిపడుతున్నారు. టీడీపీ, జనసేనపై తప్పుడు ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకున్నట్టు ఉన్నారు అనేలా వైసీపీ నేతల చేష్టలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఇలాంటి ఆరోపణలు ఎన్ని చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని కొందరు, అల్లర్లు సృష్టించేది మీరే, ఆ అల్లర్లకు కారణం టీడీపీ, జనసేన అని ఆరోపణలు చేసేదీ మీరే, అమ్మ పుట్టినిల్లు మేనమామ ఎరగడా అన్నట్టు మీ గురించి మాకు తెలీదా..? ఇలాంటి చిల్లర వేషాలకే మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఇంటికి పంపించారు అని నెటిజెన్స్ కామెంట్లల్లో ఎద్దేవా చేస్తున్నారు.

వల్లభనేని ఇంటిపై టీడీపీ మూఖల దాడి.. కట్ చేస్తే..

రెండు రోజుల క్రితం విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపై టీడీపీ గూండాల దాడి, వంశీ నివాసముంటున్న అపార్ట్మెంట్ పైకి రాళ్లు విసిరిన టీడీపీ గూండాలు. పలు వాహనాల అద్దాలు ధ్వంసం అని వైసీపీ ట్విట్టర్ వేధికగా పోస్ట్ చేసింది. అయితే నిజం నిప్పులాంటిది ఎంతో కాలం దాగదు అన్నట్టు టీడీపీ గూండాల దాడి అని వైసీపీ పోస్ట్ పెట్టిన కొన్ని గంటల్లోనే వాస్తవం వెలుగు చూసింది. ‘వల్లభనేని వంశీ ఇంటిపై రాళ్ల దాడి జరిగిన విషయం నిజమే.

కాని దాడి చేసింది మాత్రం టీడీపీ కాదు. వాస్తవానికి వ‌ల్లభ‌నేని వంశీ త‌న బినామీల‌తో న‌డిపించి బోర్డు తిప్పేసిన సంక‌ల్పసిద్ధి స్కీంలో చేరి మోస‌పోయిన బాధితులంతా, ఆయ‌న ఇంటి ముందు నిర‌స‌న‌కు దిగారని.. ఈ నేపథ్యంలో ఇంటి లోప‌లి నుంచి వంశీ రౌడీమూక‌లు సంక‌ల్పసిద్ధి బాధితుల‌పై రాళ్లు రువ్వారని, దీనితో క‌డుపుమండిన బాధితులు తిరిగి రాళ్ల దాడి చేశారని‘ టీడీపీ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చింది.

మూడునాళ్ల ముచ్చటగా మారిన పొత్తు.. పరువుపోగొట్టుకుంటున్న వైసీపీ..

నేడు పిఠాపురంలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తి గ్రామంలోని అపర్ణ దేవి అమ్మవారు ఆలయ నిర్వహణ కమిటీ బాధ్యతలు మాకు కావాలంటే మాకు కావాలని జనసేన టీడీపీ కార్యకర్తలు పట్టుబట్టడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగిందని వైసీపీ X వేదికగా పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ వైసీపీపై నిప్పులు చెరుగుతున్నారు. మీది మీరు చూసుకోకుండా ఇలా ఇతరులపై పడి ఏడవడం వల్లనే మిమ్మల్ని అధికారం నుండి దింపారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఇదే పోస్ట్‌పై ఓ వ్యక్తి కామెంట్‌లో స్పందించారు. నేను గొడవ జరిగిన సమయంలో అక్కడే ఉన్నాను, అక్కడ కూటమి కార్యకర్తలకి, వైసీపీ కార్యకర్తలకి మధ్య గొడవ జరిగింది.అయితే అసలు విషయానాన్ని దాచిపెట్టి టీడీపీకి జనసేనకు మధ్య గొడవ జరిగిందని వైసీపీ ప్రచారం చేస్తుందని ఆ వ్యక్తి కామెంట్‌లో స్పష్టం చేశారు. 


Similar News