YS Bharathi: ఏంటి భారతీ రెడ్డి ఈ కక్కుర్తి.. పేదలకు ఇచ్చే పథకాలు సైతం..?

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో లేదో అప్పుడే అది చేయలేదు ఇది చేయలేదు అని వైసీపీ ఆరోపిస్తోంది.

Update: 2024-07-06 05:30 GMT

దిశ వెబ్ డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో లేదో అప్పుడే అది చేయలేదు ఇది చేయలేదు అని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే ఇప్పుడు అధికార పార్టీని సరిగ్గా నెల గడవకముందే నిలదీస్తున్న మాజీ ముఖ్యమంత్రికి, అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాట నిలుపుకోవాలనే విషయం గుర్తుకు రాలేదా అని ప్రజలే వైసీపీపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు వైసీపీని వ్యతిరేఖిస్తున్నా అదేం పట్టించుకోకుండా టీడీపీపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శలు గుప్పించడం, ఆయన సతీమని వైఎస్ భారతి మాధ్యమాలలో తప్పుడు వార్తలు రాయించండం సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అసలు విషయానికి వస్తే.. ఎన్నికల సమయంలో చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోలో 18 నుంచి 60 ఏళ్ళ మధ్య ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తమాని హామీ ఇచ్చిన విషయం అందిరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని వైసీపీ సొంత మీడియాలో ‘ఏదీ మా నిధి’ అనే హెడ్డింగులతో ఆర్టికల్స్ వచ్చాయి. దీనిపై టీడీపీ ట్విట్టర్ వేదికగా స్పంధించింది. ‘ఏంటి భారతీ రెడ్డి గారు ఈ కక్కుర్తి.. ఆడబిడ్డ నిధి ఇచ్చేది, మీ లాగా ప్యాలెసుల్లో ఉండే వారికి కాదమ్మా.. మీకు, మీ కూతుళ్ళకి కూడా ఇవ్వమని చెప్తూ, రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్ళ మధ్య ఉన్న 1.72 కోట్ల మంది మ‌హిళ‌లకు కూడా ఇవ్వమని, మీ మీడియాలో రాయిస్తున్నారు.

మీ లాగా ఊరికి ఒక ప్యాలెస్‌లో ఉండే వాళ్ళు కూడా, పేదలకు రావలసిన పథకం కోసం కక్కుర్తి పడితే ఎలా ? మీ భర్త రాజకీయం కోసం, మరీ ఇలా కక్కుర్తి రాతలు రాయించకండి. సరేలే కానివ్వండి, ఆడబిడ్డ నిధి కోసం, మీరు, మీ కూతుళ్ళు కూడా ధరఖాస్తు పెట్టుకోండి, చంద్రబాబు గారికి మానవతా కోణం ఎక్కువ, మీ దరఖాస్తు పరిశీలిస్తాం..’ అంటూ ట్వి్ట్టర్‌లో రాసుకువచ్చింది. 


Similar News