దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ యూపీలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. యూపీలో శాంతి భద్రతలకు బీజేపీ ప్రభుత్వం అంతిమ సంస్కారాలు చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని అఖిలేష్ విమర్శించారు. ఈ క్రమంలోనే యూపీలో ఓ పెళ్లిలో జరిగిన గొడవకు సంబంధించిన వీడియోను అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ వీడియోలోని దృశ్యాల ప్రకారం.. ఆదివారం జరిగిన ఓ పెళ్లిలో డీజే విషయంలో గొడవ చోటు చేసుకుంది. దీంతో కొంతమంది యువకులు కర్రలు, బెల్టులు తీసుకొని పెళ్లికి వచ్చిన వారిని కొడుతూ నానా భీభత్సం సృష్టించారు. యువకుల దాడి నుంచి తమ బంధువులను కాపాడుకోవడానికి మహిళలు చాలా కష్టాలు పడ్డారు.
తమ వాళ్లను కొట్టవద్దని ఆ మహిళలు యువకులను బతిమాలాడారు. కానీ ఆ యువకులు అవేమీ పట్టించుకోలేదు. దొరికినవాళ్లను దొరికినట్లు వీర బాదుడు బాదారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అఖిలేష్ యాదవ్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా అంతకు ముందు అసెంబ్లీలో మాట్లాడిన అఖిలేష్ యాదవ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండాపోయిందని, ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వాళ్లపై కేసులు పెడుతూ వేధిస్తున్నారని ఆరోపించారు.
उप्र में भाजपा ने क़ानून-व्यवस्था का अंतिम संस्कार कर दिया है। pic.twitter.com/Z4vrY70PBd
— Akhilesh Yadav (@yadavakhilesh) February 26, 2023