కాంగ్రెస్ పార్టీ పై Assam CM Hemanth Biswa Sarma సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: గులాం నబీ ఆజాద్ పార్టీని వీడటంపై అసోం సీఎం హిమంత బిస్వ శర్మ తీవ్రంగా స్పందించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌లో గాంధీలు మాత్రమే మిగులుతారని శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: గులాం నబీ ఆజాద్ పార్టీని వీడటంపై అసోం సీఎం హిమంత బిస్వ శర్మ తీవ్రంగా స్పందించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌లో గాంధీలు మాత్రమే మిగులుతారని శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో కాంగ్రెస్‌ను వీడినప్పుడు కూడా ఆజాద్ రాసినట్లుగా లేఖ రాశానని తెలిపారు. 'మీరు గులాం నబీ ఆజాద్ లేఖను, 2015లో నేను రాసిన లేఖను చదివితే సారుప్యత ఉంటుంది. రాహుల్ గాంధీ పరిపక్వత లేనివారని, విచిత్రమైన వ్యక్తని, అనూహ్యంగా స్పందిస్తారని కాంగ్రెస్ పార్టీలో అందరికీ తెలుసు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ పట్ల జాగ్రత్తలు తీసుకోవట్లేదు. తన కుమారుడిని ప్రమోట్ చేసేందుకు ఇన్ని ఏళ్లు ప్రయత్నించింది. అయితే అది వ్యర్థం. దీని ఫలితంగా పార్టీకి నమ్మకంగా ఉన్న ఒక్కొక్కరు వదిలివెళ్తున్నారు' అని అన్నారు. రానున్న రోజుల్లో కేవలం గాంధీలు మాత్రమే పార్టీలో మిగులుతారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ రాహుల్ గాంధీ వరమని అన్నారు. కాగా, హిమంత బిస్వ శర్మ కూడా అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2015లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత అసోం సీఎం అయ్యారు.