AP Politics: బ్యాక్ బెంచ్‌‌లో సజ్జల.. అదే కారణమా..?

వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తరువాత నెంబర్ టూ గా చెలామణి అయ్యి, సకల శాఖామంత్రిగా పేరుపడిన సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ఓటమి తరువాత పెద్దగా కనిపించడం లేదు. గురువారం జగన్ నిర్వహించిన సమావేశంలో కనిపించినా, ఆయన జగన్ పక్కన లేరు.

Update: 2024-06-21 03:53 GMT
AP Politics: బ్యాక్ బెంచ్‌‌లో సజ్జల.. అదే కారణమా..?
  • whatsapp icon

దిశ ప్రతినిధి, అమరావతి: వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తరువాత నెంబర్ టూ గా చెలామణి అయ్యి, సకల శాఖామంత్రిగా పేరుపడిన సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ఓటమి తరువాత పెద్దగా కనిపించడం లేదు. గురువారం జగన్ నిర్వహించిన సమావేశంలో కనిపించినా, ఆయన జగన్ పక్కన లేరు. ఎదుట సీటులోనూ లేరు. జగన్ పక్కన వేదిక మీద ఉండాల్సిన సజ్జల సీటు కాస్తా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చూస్తే ఏకంగా అయిదవ బెంచ్‌లోకి వెళ్ళిపోయింది.

ఐదో వరుసలో ఎందుకో?

సజ్జల ప్రాముఖ్యత తగ్గిందా? లేక ఆయన కావాలని వెళ్ళి అక్కడ కూర్చున్నారా? అన్న చర్చకు తెర లేస్తోంది. అదే సమయంలో సజ్జల వెనక్కి వెనక్కి పోవడం పట్ల సర్వత్రా కొత్త డిస్కషన్ మొదలైంది. పార్టీ క్యాడర్‌కి, లీడర్‌కి మధ్యన ఎవరూ ఉండరాదు అని పార్టీ నాయకుల మాటను మన్నించి ఆయన్ని అలా వెనక్కి పంపించారా? అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా సజ్జల మీడియాలో కనిపించి చాలా రోజులు అయింది. అంతే కాదు ఇపుడు పార్టీలో ఆయన ప్లేస్ వెనక్కి వెళ్ళింది. మరి ఆయన ప్లేస్ ఇంకా వెనక్కి తెర వెనక్కి పోతుందా? లేక ముందుకు వచ్చేది ఉంటుందా? అన్నది చర్చగా సాగుతోంది.

ఓటమికి సజ్జలదే బాధ్యతా?

పార్టీ ఘోర ఓటమికి సజ్జలదే బాధ్యత అనే వారు లేకపోలేదు. అయితే, జగన్‌ను దగ్గరగా చూసిన వారు, జగన్ మనస్తత్వం తెలిసిన వారు మాత్రం పార్టీకి మేలు జరిగినా, కీడు జరిగినా అందుకు నూటికి నూరుశాతం జగన్‌దే బాధ్యత అని అంటున్నారు. సజ్జల అయినా, వైవీ అయినా జగన్ చెప్పింది చేయడమే తప్ప తమ అభిప్రాయాన్ని జగన్ వద్ద చెప్పే స్వేచ్ఛ లేదని, వుండదని వారు అంటున్నారు.

Tags:    

Similar News