NTR-అమిత్ షా భేటీపై RS ప్రవీణ్ కుమార్ సీరియస్
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిక సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిక సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. మునుగోడు బహిరంగ సభకు ముందు బేగంపేటలోని బీజేపీ దళిత కార్యకర్త ఇంట్లో అమిత్ షా అల్పహారం తిన్నారు. బహిరంగ సభ అనంతరం ఎన్టీఆర్‌తో లంచ్ చేశారు. ఈ రెండు భేటీలపై వ్యత్యాసం చూపుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ''NTR కు మాత్రం కులం ఉండదట, కేవలం కార్యకర్తలకు, మరీ ముఖ్యంగా దళితులకే కులం ఉంటదంట!! మీ దుంప తెగ, ఎన్ని రోజులు చేస్తరు బై ఈ మోసపూరిత ఓటు బ్యాంకు రాజకీయాలు? తెలంగాణ ప్రజలారా, మన రాజ్యం రావాలె. ఈ దొంగల దుకాణాలు బందు కావాలె'' అంటూ ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.