NTR : 'నందమూరి తారకరామారావు అనే నేను' ఆ ఘట్టానికి 40 ఏళ్లు

పార్టీ స్థాపించి 9 నెలల్లోనే ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించారు.

Update: 2023-01-09 03:35 GMT

దిశ, వెబ్ డెస్క్: పార్టీ స్థాపించి 9 నెలల్లోనే ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించారు. 'నందమూరి తారక రామారావు అనే నేను' అంటూ సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే రోజు(జనవరి 9) ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1983 జనవరి 9న ఎల్బీ స్టేడియంలో ఎన్టీఆర్ విశేష జన సమూహం మధ్యలో ఏపీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. తెలుగు వాడి ఆత్మగౌరవ నినాదంతో పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేసి ప్రజలకు చేరువయ్యారు. ప్రపంచంలో నేటికి ఏ పార్టీకి సాధ్యం కానంతగా పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి పాలిటిక్స్‌లో సంచలనం సృష్టించారు.

ఆయన తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాయనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణలోనూ పటేల్, పట్వారీ వ్యవస్థను ఎన్టీఆరే రద్దు చేశారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ఎన్టీఆరే ప్రారంభించారు. పాఠశాలల్లో మద్యాహ్న భోజన పథకాన్ని ఆయనే ప్రారంభించారు. సింగిల్ విండో విధానం తెచ్చి రైతులకు సులభంగా రుణాలు లభించేలా చేశారు. ఏపీలో మునసబు, కరణాల వ్యవస్థను ఆయనే రద్దు చేశారు. యువత, విద్యావంతులు రాజకీయాల్లో అవకాశాలు దక్కాలని వారికి అవకాశాలు కల్పించారు.     

Also Read...

పవన్-చంద్రబాబు భేటీ.. RGV సంచలన ట్వీట్ 

Tags:    

Similar News