టీడీపీ Vs వైసీపీ.. ఆ విషయంలో ఆగని ట్టీట్ వార్.. జగన్నాటకాలు అంటూ నెటిజన్స్ ఫైర్..

అటు అధికార పార్టీకి ఇటు వైసీపీకి మధ్య పచ్చ గడ్డి వేసినా బగ్గుమంటోంది.

Update: 2024-06-30 15:16 GMT

దిశ వెబ్ డెస్క్: అటు అధికార పార్టీకి ఇటు వైసీపీకి మధ్య పచ్చ గడ్డి వేసినా బగ్గుమంటోంది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. అయితే వైసీపీ మాత్రం అసత్యాలతో టీడీపీపై బురదజల్లేందుకు యత్నిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. నిన్న మొన్నటి వరకు పెన్షన్లు సకాలంలో ఇవ్వాలి అని ఆరోపించిన వైసీపీ తీరా రేపు అధికార పార్టీ పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో అసత్యాలను ప్రచారం చేస్తోందని పలువురు మండిపడుతున్నారు.

అసలు విషయానికి వస్తే.. రేపు కూటమి ప్రభుత్వం పంపిణీ చేయనున్న పెన్షలపై వైసీపీ ట్విట్టర్ వేదికగా స్పంధించింది. పెన్షన్‌ను తీసుకునే వాళ్లు కచ్చితంగా 1,2 తేదీల్లో తీసుకోవాలని లేకపోతే రద్దు చేస్తాం అని దండోరా వేస్తున్న వీడియోని వైసీపీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కాగా ఈ ట్వీట్‌పై టీడీపీ స్పంధించింది. ‘పేదలకు ఒకేసారి రూ.7 వేలు పెన్షన్ ఇస్తుంటే, జగన్ రెడ్డి ఓర్వలేక, తన ప్యాలెస్ బుద్ధి బయట పెట్టుకున్నాడు. చంద్రబాబు గారు స్పష్టంగా 3 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా, అన్నీ కలిపి ఒకేసారి ఇస్తామని చెప్తున్నా ఫేక్ ప్రచారం చేస్తున్నాడు.

తన హయాంలో (2024 ఏప్రిల్ ముందు) పేదలను పీక్కుతింటూ, ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా రద్దు చేస్తాం అంటూ వేసిన డప్పుని, నేడు మళ్ళీ చూపిస్తూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నాడు.’ అని వైసీపీ ట్వీట్‌ ఫేక్ అని టీడీపీ రీట్వీట్ చేసింది. అనంతరం టీడీపీ చేసిన రీట్వీట్‌కు వైసీపీ కౌంటర్ ఇస్తూ మళ్లీ ట్వీట్ చేసింది. ‘పింఛను తీసుకునే అవ్వాతాతలను ఏడిపించిన చరిత్ర ఎవరిదో అందరికీ తెలుసు.

జగనన్న హయాంలో చివరి మూడు నెలలు మీరు అడ్డుకునే వరకూ పండుటాకులకి చిన్న కష్టం కూడా కలగకుండా గడప వద్దే పింఛను అందించిన చరిత్ర మాది. 14 ఏళ్లలో ఒక్కరోజైనా ఇంటి వద్దకే పింఛను పంపించాడా? జులైలో గడప వద్దకే పెన్షన్ ఇవ్వడానికి తెగ ఆపసోపాలు పడుతున్నారు కదా? వీలైనంత మంది పింఛనుదారులకి డబ్బు ఎగ్గొట్టడానికే కదా ఈ డప్పు ప్రచారం!’ అంటూ రాసుకొచ్చింది.

వైసీపీ కౌంటర్‌కు టీడీపీ ఎన్‌కౌటర్ ఇస్తూ ట్వీట్ చేసింది. ‘రాష్ట్రంలో మొదలైన పెన్షన్ల పండగ.. గత చేతకాని పాలన లాగా ఇచ్చిన మాట తప్పి, విడతల వారీగా పెంచటం కాకుండా, ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వటమే కాక, ఇచ్చిన హామీ ప్రకారం గత మూడు నెలల నుంచి పెంచిన పెన్షన్ తో కలిపి రూ.7 వేలు పంపిణీ. అంటూ దండోర వేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. కాగా వైసీపీ ట్వీట్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు.

ఎన్నికల సమయంలో సచివాలయం సిబ్భందితో పించను పంపిణీ చేయించడం వీలు పడదని చెప్పి వృద్ధులను సచివాలయాల చుట్టూ తిప్పి సెంటిమెంట్ ఓట్ల కోసం యత్నించడం నిజం కాదా జగన్నాటకాలు చూసే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు అంటూ నెటిజన్స్ కామెంట్లల్లో ఘాటుగా స్పంధిస్తున్నారు.  


Similar News