బాబును నమ్మితే ఎన్టీఆర్కే దెబ్బేశారు.. ఎమ్మెల్యేలు ఓ లెక్కా: మంత్రి రోజా

చంద్రబాబును నమ్మితే ఎన్టీఆర్ కే దెబ్బేశారని.. ఎమ్మెల్యేలు ఓ లెక్కనా అంటూ మంత్రి రోజా ఆరోపించారు.

Update: 2023-03-28 10:09 GMT

దిశ, ఉత్తరాంధ్ర: చంద్రబాబును నమ్మితే ఎన్టీఆర్ కే దెబ్బేశారని.. ఎమ్మెల్యేలు ఓ లెక్కనా అంటూ మంత్రి రోజా ఆరోపించారు. విశాఖపట్నం సింహాచలం సింహాద్రి అప్పన్నను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు, వేద ఆశీర్వచనం అందచేశారు. స్వామివారి ప్రసాదంతో పాటు జ్ఞాపిక అందజేశారు. రూ.54 కోట్ల అప్పన్న ప్రసాద్ స్కీం పనులపై వీడియో ప్రెసెంటేషన్ ను అధికారులు మంత్రి రోజాకు ప్రదర్శించారు. సింహాచలం వరాహాలక్ష్మి నృసింహ స్వామి ఆలయం తనకు ఎంతగానో ప్రశాంతతను ఇచ్చిందన్నారు. స్వామివారికి ప్రభుత్వం ఇస్తున్న ప్రసాద్ స్కీం టెండర్ కు రానుందని వెల్లడించారు. భక్తులకు అవసరమయిన అన్ని వసతులు కల్పించబోతున్నామని తెలిపారు.

పెద్ద డార్మిటరి కట్టబోతున్నామని తెలిపారు. దేవాలయానికి 6 మినీ బ్యాటరీ కారులు ప్రసాద్ స్కీం ద్వారా ఇవ్వబోతున్నామని తెలిపారు. గంగాధర వద్ద 10 వరకు ధార సౌకర్యాలు కల్పించబోతున్నామని వెల్లడించారు. అన్నదానానికి వచ్చే భక్తులకు త్వరగా అన్న ప్రసాదం అందించడానికి ఆధునిక మెషినరీ అందించబోతున్నామని తెలిపారు. స్వామివారి మెట్లమార్గాన్ని ఆధునీకరించి భక్తులకు అధునాతన సౌకర్యాలను కల్పించబోతున్నామని మంత్రి రోజా తెలిపారు. ఒక సంవత్సర కాలంలోనే ఈ ప్రసాద్ స్కీం క్రింద సింహాచలం దేవస్తానంను అభివృద్ధి చేస్తామన్నారు.

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కమ్మిట్ మెంట్ ఉన్నవాళ్లు, పార్టీ పై నమ్మకం ఉన్నవాళ్లు పార్టీ విధానాలకు కట్టుబడి ఉంటారని, వైసీపీ నుంచి వేరే పార్టీకి వెళ్లినవారందరూ జగన్ చరిష్మాతో గెలిచినవారేనని రోజా గుర్తు చేశారు. కరోనా సమయంలో నీ ప్రాణాన్ని కాపాడారు అన్నప్పుడు, పార్టీకి ఎందుకు ఓటు వెయ్యలేదని ప్రశ్నించారు. చంద్రబాబును నమ్మిన యన్.టి.ఆర్.కె దిక్కులేదని.. ఆయన నమ్మి వెళ్లిన ఎమ్మెల్యేలను నట్టెటలో ముంచేయడం ఖాయమని విమర్శించారు. 45 ఎమ్మెల్సీలు వచ్చిన వైసీపీ ప్రశాంతంగా వుంటే .. అతి తక్కువ వచ్చిన టిడిపికి బలుపు ఎక్కువైందన్నారు. ఈమాత్రం ఎమ్మెల్సీల గెలుపును చంద్రబాబు కూడా కలలో ఊహించలేదని.. తక్కువ సీట్ల గెలుపుతో లోకేష్ గెలిచామని మాట్లాడుతుండడం చూస్తే ఏమనుకోవాలని రోజా ఎద్దెవా చేశారు.

Tags:    

Similar News