అది నాకు ఇబ్బందిగా ఉంది.. విభేదాలపై క్లారిటీ ఇచ్చిన కేశినేని చిన్ని..

తనని గారు అని అంటుంటే చాలా ఇబ్భందిగా ఉందని కేశినేని చిన్ని అన్నారు.

Update: 2024-06-29 14:57 GMT

దిశ వెబ్ డెస్క్: తనని గారు అని అంటుంటే చాలా ఇబ్భందిగా ఉందని కేశినేని చిన్ని అన్నారు. కొత్తకొత్త పదాలు వద్దని, ఎప్పుడూ పిలిచినట్టే చిన్ని అని పిలవమని ఆయన పలువురు నేతలకి సూచించారు. ఎందుకుంటే తనకు ఆ పదవి పార్టీ నేతల సహాయంతో వచ్చిందని కనుక తాను నేడు పదవిలో ఉన్నంతమాత్రానా గారు అని పిలవాల్సిన పనిలేదన్నారు. తాను రాజకీయ్యాల్లోకి వచ్చినప్పుడు తనని మొదట ప్రోత్సహించింది వెంకన్న అని తెలిపారు.

అలానే మీర సైతం తనను ఎంతో ప్రోత్సహించారని, వారిరువురి ప్రోత్సాహంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపారు. అలానే తనకు చంద్రబాబు నాయుడు అంటే చాల ఇష్టం అని పేర్కొన్నారు. అయితే ఎన్నికల సమయంలో కేశినేని నాని ఇచ్చే స్టేట్‌మెంట్‌లు చూసి తనకి చాలా విరక్తి కలిగిందని తెలిపారు. ఆ సమయంలో వెంకన్నను పార్లమెంట్ మెంబర్‌గా నిలోచమని తాను అడిగినట్టు తెలిపారు.

అయితే వెంకన్న మాత్రం ఆయనకు వీలుపడదని, అందుకని తననే నిలుచోమన్నారని, అయినా తాను రెండు నెలలు అంగీకరించలేదని, ఆ తరువాత తాను అగీకరించినట్టు తెలిపారు. తమ మధ్య ఏవేవో విభేదాలు ఉన్నాయని అనుకుంటున్నారని, అయితే అలాంటివి ఏం లేవని, కుటుంబం అన్నాక చిన్నచిన్న మనస్పర్ధలు వస్తుంటాయని, తాము వాటిని పట్టించుకోమని స్పంష్టం చేశారు.

Similar News