AP Politics: మాజీ సీఎం జగన్‌కు చేదు అనుభవం.. మావయ్యా అంటూ మాస్ ర్యాగింగ్
కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి సైతం తెలియకూడదు అంటారు పెద్దలు.
దిశ వెబ్ డెస్క్: కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి సైతం తెలియకూడదు అంటారు పెద్దలు. అలాంటి ప్రజల సొమ్మునే ఆ ప్రజలకు ఇస్తూ తన సొంత ఖజానా నుండి నగధు తీసి ప్రజలకు ఇచ్చినట్టు భావించారు, ఇప్పటికీ భావిస్తూనే ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అధికారంలో ఉన్న సమయంలో ఎవరూ అంధించని సంక్షేమం ఆయనే అధించినట్టు కలరింగ్ ఇస్తూ, పాఠశాల విధ్యార్థులను సైతం తన ఇమేజ్‌ను పెంచుకునేందుకు ఉపయోగించుకున్నారు అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడికి వెళ్లినా విద్యార్థులకి మైక్ ఇచ్చి వారితో జగన్‌ను ప్రశంసిస్తూ మాట్లాడేలా కొందరు ఉపాధ్యాయులు వాళ్లకు బోధించే వాళ్లు. ఇలా విధ్యార్థులు వాళ్లకి ఇచ్చిన స్క్రిప్ట్‌ను బట్టీ పట్టి మాట్లాడే వారు. ఇలా మాట్లాడుతూ మధ్యలో విద్యార్థులు స్పీజ్ మరిచిపోయిన ఘటనలు కోకొల్లలు. అయితే స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకున్న ప్రతి ఒక్క విద్యార్థీవిద్యార్థినీలు జగన్‌ను మామయ్యా అని పిలవకుండా స్టేజ్ దిగేవారు కారని అదే ఇప్పుడు జగన్ కొంప ముంచిందని పలువురు ఎద్దేవ చేస్తున్నారు.
దీనికి కారణం 2024 ఎన్నికల తరువాత తొలిసారిగా అందరూ అసెంబ్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ సైతం అసెంబ్లీ దగ్గరకు చేరుకున్నారు. అసెంబ్లీ బయటనే జగన్‌కు చుక్కెదురైంది. అసెంబ్లీ బయట జగన్ మావయ్యా అంటూ సాధారణ ప్రజలు జగన్ వెంట పడి జగన్‌ని ర్యాగింగ్ చేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.