TDP contest in Telangana: తెలంగాణలో టీడీపీ పోటీ.. బాబు ప్లాన్ ఇదేనా..?

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న టీటీడీపీ నాయకులతో సమావేశమయ్యారు.

Update: 2024-06-01 09:57 GMT

దిశ వెబ్ డెస్క్: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న టీటీడీపీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఇక నుంచి తెలంగాణ రాజకీయాలకూ సమయం కేటాయిస్తానని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసేందుకు నేతలు సిద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలను సూచించారని సమాచారం.

అయితే 2024 పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణకు దూరంగా ఉన్న చంద్రబాబు ఉన్నట్టుండి తెలంగాణ స్థానిక ఎన్నికలకు సిద్దం కావాలని సూచించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో మళ్లీ పట్టుసాధించాలనే చంద్రబాబు ప్రయత్నం ఫలిస్తుందా..?

2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తెలంగాణలో పోటీ చేసింది. అయితే ఆ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలు గెలిచి తమ పట్టు నిలుపుకున్నా టీడీపీ మాత్రం అధికారంలోకి రాలేకపోయింది. దీనితో తెలంగాణ టీడీపీ నేతలు పార్టీకి బైబై చెప్పి కాంగ్రెస్, బీఆర్‌స్ పార్టీల్లో చేరారు. దీనితో టీడీపీకి తెలంగాణలో కేడర్ లేకుండా పోయింది. ఇక 2019 ఎన్నికలో ఏపీ సైతం ఘోర పారాజయాన్ని చవిచూసింది.

దీనితో 2024 ఎన్నికల్లో ఏపీలో మళ్లీ పట్టుసాదించాలని నిర్ణయించుకున్న చంద్రబాబు పూర్తిగా ఏపీపైనే దృష్టిసారించారు. దీనితో టీడీపీ 2024 పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు ముగిసాయి. ఈ నేపథ్యంలో మళ్లీ తెలంగాణలో పట్టుసాదించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ స్థానిక ఎన్నికలకు సిద్దం కావాలని నేతలకు సూచించారని సమాచారం. 


Similar News