ఆశ్చర్యపడేలా 2024 ఫలితాలు ఉంటాయి: రాహుల్ గాంధీ

రాబోయే సార్వత్రిక ఎన్నికలపై అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తాయన్నారు.

Update: 2023-06-02 07:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే సార్వత్రిక ఎన్నికలపై అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తాయన్నారు. వాషింగ్టన్ నేషనల్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. దేశంలో ప్రతిపక్షాలన్నీ రైట్ వే లో ఉన్నాయని విపక్షాలన్ని ఏకతాటితో పని చేసి వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరింత మెరుగ్గా పని చేస్తుందని కేవలం లెక్కలు వేసుకోవాలన్నారు. మిగతా విపక్షాలతో కాంగ్రెస్ నిత్యం టచ్ లోనే ఉంటూ చర్చలు జరుపుతోందన్నారు. ప్రతిపక్ష మహాకూటమిపై తనకు నమ్మకం ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం సంస్థలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలపై కక్షసాధిస్తోందని ధ్వజమెత్తారు. హత్య బెదిరింపుల గురించి తాను ఆందోళన చెందనని స్పష్టం చేశారు. ఎప్పుడో ఓసారి చనిపోవాల్సిన వారమేనని తన నానమ్మ, తండ్రి నుంచి తాను ఇదే నేర్చుకున్నానని చెప్పారు.

Tags:    

Similar News