‘రేవంత్ రెడ్డి యాత్రకు భద్రత కల్పిస్తున్నాం’
టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి భద్రత పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి(మార్చి 6) వాయిదా వేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి భద్రత పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి(మార్చి 6) వాయిదా వేసింది. హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు మరింత భద్రత పెంచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో భాగంగా రేవంత్ రెడ్డి యాత్రకు భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వం తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. యాత్రకు భద్రత కల్పించాలని ఇప్పటికే తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్, జిల్లాల ఎస్పీలకు సమాచారం అందించారని లాయర్ న్యాయస్థానానికి తెలిపారు.
ఈ నేపథ్యంలో తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కాగా, రాజకీయ ప్రత్యర్థులు తన యాత్రపై దాడులు జరుపుతున్నట్టు రేవంత్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. యాత్రలో భాగంగా భూపాలపల్లి జిల్లాలో సభలో ప్రసంగిస్తుండగా ప్రత్యర్థులు రాళ్లు, కోడిగుడ్లు, టమాటలు విసిరిన సంఘటనను పిటిషన్‌లో ప్రస్తావించారు.