TRS Vs BJP: జనగామలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీ వార్

Flexi war Between TRS, BJP in Jangaon| బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన మూడో విడత ప్రజా సంగామ యాత్ర నేడు జానగామలో జరుగనుంది. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో ప్లేక్సీలను ఎర్పాటు చేశారు. బీజేపీ కి దీటుగా టీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

Update: 2022-08-17 05:04 GMT

దిశ, జనగామ: Flexi war Between TRS, BJP in Jangaon| జనగామ జిల్లా ఒక్కసారిగా హీటెక్కింది. బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య ఫ్లెక్సీల రగడ నెలకొంది. గత మూడు రోజులుగా జనగామ జిల్లాలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుంది. అయితే మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చింపివేయడం తో రాజకీయం మరింత వేడెక్కింది. ఇది పక్కా టీఆర్ఎస్ శ్రేణుల పనేనని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.

మరోపక్క స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భారీగా హోర్డింగ్లు ఏర్పాటు చేసి నీతి ఆయోగ్‌లో పేర్కొన్నట్లుగా నిధులు తీసుకొచ్చినప్పుడే బండి సంజయ్ జిల్లాకు రావాలని సవాల్ విసరడం తో ఒక్కసారిగా రెండు పార్టీల మధ్య వార్ నెలకొంది. రెండు రోజుల క్రితం దేవరుప్పుల మండలం లో టీఆర్ఎస్ బీజేపీ మధ్య తీవ్రస్థాయిలో కొట్లాట జరగ్గా మంగళవారం జనగామలో బీజేపీ ఫ్లెక్సీలు చించివేయడం దీనికితోడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేసి బీజేపీకి సవాల్ విసరడంతో జనగామలో ఒక్కసారిగా రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి.

ఇదిలావుంటే బీజేపీ జిల్లా అధ్యక్షుడు బండి సంజయ్ యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు టీఆర్ఎస్ నాయకులు చించివేయడం సరైంది కాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అరుట్ల దశమంత్ రెడ్డి టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న ఆదరణ చూసి టీఆర్ఎస్ పార్టీలో వణుకు పుట్టిందని దశమంత్ రెడ్డి అన్నారు. మరో రెండు రోజుల పాటు జనగామ జిల్లాలో బండి సంజయ్ యాత్ర కొనసాగనుంది. దీంతో భారీగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. సీనియర్ నేత రాజీనామా ?

Tags:    

Similar News