బీజేపీలోకి Junior NTR.. ఏపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ ఎన్టీఆర్-అమిత్ షా భేటీపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ ఎన్టీఆర్-అమిత్ షా భేటీపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు ఉపయోగం లేనిదే ఎవరితోనూ మాట్లాడరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏపీలో బీజేపీని విస్తరించేందుకే ఎన్టీఆర్‌ను అమిత్ షా కలిసినట్లు భావిస్తున్నానని తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో బీజేపీ దేశ వ్యాప్తంగా ప్రచారం చేయించాలని చూస్తోందని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. కాగా, ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని ఈ విధమైన కామెంట్లు చేయడంపై ఎన్టీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.