అప్పులతో ఆర్థిక సంవత్సరం ఆరంభం.. కాంగ్రెస్ నేత తులసి రెడ్డి
ఏపీలో ఆర్థిక సంవత్సరం అప్పులతో ఆరంభమైందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి ధ్వజమెత్తారు.
దిశ, కడప: ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరం అప్పులతో ఆరంభమైందని, మొదటి పనిదినం అయిన ఏప్రిల్ 3వ తేదీన వైకాపా ప్రభుత్వo ఆర్బిఐ వద్ద 2000 కోట్ల రూపాయలు అప్పుచేసిందని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ తులసి రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవ్సరం మొదటి పని దినాన ఆర్బిఐవద్ద అప్పు చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. 1956నుంచి 2014 వరకు 58సంవత్సరాల్లో చేసిన అప్పు ఒక లక్ష కోట్ల రూపాయలుని, 2014నుంచి 2019వరకు ఐదు సంవ్సరాలలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 1.50లక్షల కోట్ల రూపాయలు అన్నారు.
ఈ నాలుగు సంవ్సరాలలో జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు7.50లక్షల కోట్ల రూపాయలు అని ఆయన విమర్శించారు. అయినప్పటికీ సకాలంలో ఉద్యోగులకి జీతాలు, విశ్రాంతి ఉద్యోగులకు పించన్లు, కాంట్రాక్టర్ లకి పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితి శ్రీలంక కంటే అధ్వాన్నంగా వుంది అన్నారు. ఏప్రిల్ మాసానికి సంబంధించి ఒకటో తేదీ పెన్షన్ పంపిణీ ఉంటే మూడో తేదీ సగము నాలుగో తేదీ సగం పంచడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ఆర్థిక క్రమశిక్షనని పాటించాలని, అలవికాని అప్పులు చేయవద్దని జగన్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తుంది అన్నారు.