కేసీఆర్ కుటుంబంపై మాణిక్కం ఠాగూర్ ఆరోపణలు

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ కుటుంబం పెద్ద ఎత్తున భూదందాలకు పాల్పడుతోందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ గురువారం ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేశారు.

Update: 2022-09-02 06:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ కుటుంబం పెద్ద ఎత్తున భూదందాలకు పాల్పడుతోందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ గురువారం ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేశారు. 2,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కేసీఆర్ సర్కార్ ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేసిందని అన్నారు. ఈ భూములను అతి తక్కువ ధరకు పంచిపెట్టి కేసీఆర్ కుటుంబం లబ్ధిపొందిందని ఆరోపించారు. ఈ అంశంలో గవర్నర్ తమిళిసై జోక్యం చేసుకుంటారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఈ దోపిడీకి ముగింపు పలకాలన్నారు.

హరీష్ రాజీనామా చేయగలరా?:

హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ అంశంపై మాణిక్కం ఠాగూర్ రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం పేదల ఆరోగ్యాలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. మంత్రి హరీష్ రావు టార్గెట్ విమర్శలు గుప్పించారు. గర్భవతి అయిన భారతీయ మహిళ టూరిస్ట్ మరణించడంతో పోర్చుగల్ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేశారని మరి ఇబ్రహీంపట్నం ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి హరీశ్ రావు రాజీనామా చేస్తారా? ప్రశ్నించారు.

Also Read : పోయే కాలం వస్తే ఇంతేనేమో.. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి సీరియస్ 

Tags:    

Similar News