AP Politics: పదవి ఆమెది.. పెత్తనం పీఏది..! పోలీసులకు ఫిర్యాదులు..

164 స్థానాలను కైవసం చేసుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

Update: 2024-06-29 10:00 GMT

దిశ వెబ్ డెస్క్: 164 స్థానాలను కైవసం చేసుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కాగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై నూతన ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ పాలనలో అన్యాయానికి గురెన ప్రజలు సైతం ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. దీనితో అధికారం ముసుగులో వైసీపీ నేతలు చేసిన అక్రమాల గుట్టు రట్టవుతోంది.

తాజాగా పల్నాడు జిల్లాలో మాజీ వైసీపీ మంత్రి విడతల రజిని పీఏపై పోలీసులకు ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..పల్నాడు జిల్లాలోని యడ్లపాడు మండలానికి చెందిన స్టోన్ క్రషర్ వ్యాపారులను 2020వ సంవత్సరంలో రజిని పీఏ రామకృష్ణ రూ.5 కోట్ల లంచం కోసం బెదిరించారని ఆరోపించారు. అయితే అంత కట్టలేమని వ్యాపారులు బతిమాలితే చివరికి రూ.2.20 కోట్లకు రజిని మరిది గోపి డీల్ సెట్ చేశారని అన్నారు.

పీఏ రామకృష్ణ దందాకు అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా సహకరించారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు.. మాజీ వైసీపీ మంత్రి విడతల రజిని పీఏపై పల్నాడు అడిషినల్ ఎస్పీ లక్ష్మీపతికి ఫిర్యాదు చేశారు.


Similar News