కర్ణాటక రిజల్ట్స్‌పై కేసీఆర్ ఆసక్తి.. హంగ్ వస్తే కీలకం కానున్న కేసీఆర్ నిర్ణయం!
కర్ణాటక ఎన్నికల రిజల్ట్ కోసం సీఎం కేసీఆర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ ఏ పార్టీ గెలుస్తుందోనని ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో గెలిచే పార్టీతో ఇక్కడ ఫైట్ చేయాల్సి ఉంటుందని చర్చ బీఆర్ఎస్‌లో ఉంది.
దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక ఎన్నికల రిజల్ట్ కోసం సీఎం కేసీఆర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ ఏ పార్టీ గెలుస్తుందోనని ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో గెలిచే పార్టీతో ఇక్కడ ఫైట్ చేయాల్సి ఉంటుందని చర్చ బీఆర్ఎస్‌లో ఉంది. అలాగే కేసీఆర్ పొలిటికల్ రోడ్ మ్యాప్ కూడా కర్ణాటక అసెంబ్లీ ఫలితాలపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పోటీ ఉంటుందనే అంశం ఫలితాల తర్వాత క్లారిటీ వస్తుందని బీఆర్ఎస్ లీడర్లు అంచనా వేస్తున్నారు. అక్కడ అధికారంలోకి వచ్చిన పార్టీ తెలంగాణలో విజయం కోసం ఉత్సాహంగా పని చేయడం సహజం. అలాగే ఆ పార్టీ అధిష్టానాలు సైతం తెలంగాణలో అధికారం కోసం మరింత ఫోకస్ పెట్టేందుకు సిద్ధం అవుతాయి. అయితే కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చినా, ప్రతిపక్షానికి పరిమితమైన ఆ పార్టీతో తెలంగాణలో ఎలా ఫైట్ చేయాలో కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.
హంగ్ పై బీఆర్ఎస్ ఆశలు...
కర్ణాటకలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రావొద్దని, హంగ్ రావాలని బీఆర్ఎస్ లీడర్లు ఆశిస్తున్నారు. హంగ్ లో జేడీఎస్ లేకుండా, కాంగ్రెస్, బీజేపీలు సొంతంగా అధికారంలోకి రావు. జేడీఎస్ పార్టీ పెద్దలు సీఎం కేసీఆర్ సలహాలు, సూచనలు లేకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరని భావిస్తున్నారు. కేసీఆర్ గైడెన్స్ మేరకు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో తుది నిర్ణయం తీసుకుంటారని చర్చించుకుంటున్నారు.
Also Read.
చరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. ఎన్నికల శంఖారావం తలపించేలా!