ఆయనపై అబాండాలు వేయకండి అంటూ.. జగన్‌ కు Bandla Ganesh విన్నపం (వీడియో)

ఇటీవల సీఎం జగన్, పవన్ కల్యాణ్ మూడు పెళ్లీళ్లపై పలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, దీనిపై సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పందిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.

Update: 2023-10-13 07:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల సీఎం జగన్, పవన్ కల్యాణ్ మూడు పెళ్లీళ్లపై పలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, దీనిపై సీని నిర్మాత బండ్ల గణేష్ స్పందిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. నిన్నటి నుంచి మనసులో ఒకటే వేదన.. ఒకటే బాధ.. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే.. నా బతుకు ఎందుకు? అని నాకే అనిపిస్తుంది.. చిరాకు వేస్తుంది.. నిన్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నాకు ఇష్టుడైన పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టారీతిన మాట్లాడారు.. అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు.. భగవంతుడు మీకు గొప్ప హోదాను ఇచ్చారు.. నేను దశాబ్దాలుగా ఆయన వెంట తిరిగాను. ఆయన వ్యక్తిత్వం గురించి నాకు తెలుసు.. ఆయన చాలా నిజాయితీ పరుడు, నీతివంతుడు.. ఎవరు కష్టంలో ఉన్నా.. అది నా కష్టం అని భావించే భోళా మనిషి. జీవితంలో కొందరికి కొన్ని చేదు సంఘటనలు జరుగుతాయి..అవి కూడా ఆయన ప్రమేయం లేకుండా జరిగినవే.. అని నేను భావిస్తున్నాను.

అదొక్కటే కారణం ఉంది కదా? అదే పదే పదే మాట్లాడటం బాధగా ఉంది.. పవన్ కళ్యాణ్ సమాజం కోసం ఉపయోగపడే మనిషి.. దేశం కోసం బతికే మనిషి. నిస్వార్థంగా ఉంటాడు.. స్వలాభం కోసం ఏ పని చేయడు.. హాయిగా షూటింగ్‌లు చేసుకుంటూ సూపర్ స్టార్‌లా బతకండని నేను చెబుతుండేవాడ్ని. కానీ జనాల కోసం ఏదో ఒకటి చేయాలని వచ్చారు.. అన్నీ సహిస్తూ తలవంచుకుని జనం కోసం బతుకుతున్నాడు.. రాత్రి పగలు కష్టపడి.. సంపాదించిన డబ్బును పార్టీకి, ప్రజలకు పెడుతున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చిందన్నా సరే ముందుకు వస్తాడు.. ఆయనకు కులాభిమానం లేదు.. దేశ ప్రజలంతా ఒక్కటే అని భావిస్తారు. ఆయన పెట్టిన బిక్ష.. ఆయన మంచి వ్యక్తి నిజాయితీ పరుడు. తెలిసీ తెలియకుండా అబాండాలు వేయకండి’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బండ్ల గణేష్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News