తెల్లవారుజామునే నిద్రలేచిన చంద్రబాబు.. జైలులో ఏం చేశారో తెలుసా?

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న ఆయన గురువారం తెల్లవారుజామునే నిద్రలేచి ముందుగా యోగా చేసి తర్వాత పేపర్ చదివినట్లు సమాచారం.

Update: 2023-09-14 02:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న ఆయన గురువారం తెల్లవారుజామునే నిద్రలేచి ముందుగా యోగా చేసి తర్వాత పేపర్ చదివినట్లు సమాచారం. ఇవాళ చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ములాఖత్ కానున్నారు. ఈ ములాఖత్‌లో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ నేతలు చేయాల్సిన పనులను బాలకృష్ణకు చంద్రబాబు సూచించనున్నట్లు సమాచారం.

కాగా, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10 శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జ‌రిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది. ప్రభుత్వం చెల్లించిన రూ.370 కోట్లలో రూ.240 కోట్ల రూపాయ‌ల‌ను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థకు బ‌ద‌లాయించారంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. కేబినెట్‌ను తప్పుదారిపట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి.. డబ్బులు కాజేశారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై గత కొంత కాలంగా లోతుగా విచారిస్తున్న సీఐడీ.. పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు.

Tags:    

Similar News