AP Politics: ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ ఖాయం.. సీఎం రమేష్..

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి 400పైగా సీట్లతో నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారన్నారని, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమి బలపరిచిన అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు.

Update: 2024-04-24 10:48 GMT

దిశ ప్రతినిధి, అనకాపల్లి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి 400పైగా సీట్లతో నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారన్నారని,  బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమి బలపరిచిన అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. ఈ మేరకు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం నిర్వహించిన సమావేశంలో విలేకరులతో సీఎం రమేష్ మాట్లాడారు.

యువతకు ఉద్యోగావకాశాలు లేవని, జగన్ ఒక్క చాన్సు అని చెప్పి అధికారంలోకి వచ్చి ఉద్యోగాల కల్పనపై దృష్టిసారించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్‌ను ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారని తెలిపారు. వచ్చే నెల 3 లేక 4వ తేదీల్లో ప్రధాన మంత్రి మోదీ అనకాపల్లి వస్తున్నారన్నారని పేర్కొన్నారు. ఒకసారి ప్రధాని వస్తే ఇక్కడున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళతామన్నారు.

దీంతో అనకాపల్లికి ప్రధాని మోదీ గ్యారంటీ ఇచ్చి వెళతారని చెప్పారు. అలాగే చిరంజీవి గురించి మాట్లాడే అర్హత సజ్జల రామకృష్ణారెడ్డికి లేదన్నారు. కూటమిగా పోటీ చేయడంతో సంతోషమని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్ధులను గెలిపించాలని చిరంజీవి అన్నారని, దానిపై ఇష్టాసారంగా మాట్లాడటం సరైంది కాదని మండిపడ్డారు. అలాగే గతంలో సినీ ఇండస్ట్రీ సమస్యలపై ముఖ్యమంత్రి వద్దకు వెళితే తీవ్రంగా అవమానించారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రానున్న ఎన్నికల్లో వైసీపీకి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అభిమానులు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. కరుడు కట్టిన వైసీపీ నాయకుల్లా పోలీసులు వ్యవహరించడం సరైంది కాదన్నారు. అనంతరం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. వైసీపీ పాలన చూసి రాష్ట్ర ప్రజలకు అసహ్యం వేసిందన్నారు.

రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, మళ్లీ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు సీఎం కావాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలిపారు. పారిశ్రామికంగా అనకాపల్లి ఏరియా మంచి అభివృద్ధి చెందుతుందని, దీనికి సరైన నాయకత్వం అవసరమని, దానికి సీఎం రమేష్ ఎంపీ అయితే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ సీఎం రమేష్ సారధ్యంలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం భవిష్యత్లో ఎంతో అభివృద్ధి చెందుతుందనే నమ్మకం ఉందన్నారు. సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీగా పేరు ప్రకటించగానే అందరిలో బలమైన నమ్మకం ఏర్పడిందన్నారు. సమస్యలు పరిష్కరించే శక్తి సామర్ధ్యాలు సీఎం రమేష్ కు ఉన్నాయన్నారు.

అతి తక్కువ కాలంలో సీఎం రమేష్ అనకాపల్లి ప్రజల ఆదరణ పొందరి తెలిపారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు విసుగుచెందారని, ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అనకాపల్లి నుంచి మన ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశ్యంతో సీఎం రమేష్‌ను  గెలిపించాలన్నారు. ఆ తరువాత పాయకరావుపేట నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. సత్తా గల నాయకుడు సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడం హర్షణీయమన్నారు.

నామినేషన్ కార్యక్రమంలో పోలీసులు ఓవర్ యాక్షన్ సరైంది కాదన్నారు. పోలీసులకు, ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతుంటే ఇందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఓటమి భయంతోనే ఈ విధమైన విన్యాసాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

కాగా ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ద నాగ జగదీష్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు కర్రి చిట్టిబాబు, సీఎం రమేష్ తనయుడు రిత్వికర్, జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు డాక్టర్ గండి వెంకట సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర నాయకులు పొన్నగంటి అప్పారావు, బీజేపీ నాయకుడు పరుచూరి భాస్కరరావు, పెద్ద సంఖ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News