తెలుగు రాజకీయాల్లో అనూహ్య పరిణామం.. RS ప్రవీణ్ కుమార్ పాదయాత్రలో కీలక నేత!

తెలుగు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తెలంగాణ బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎదురుపడటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Update: 2022-09-20 11:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తెలంగాణ బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎదురుపడటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంగళవారం మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్‌లో బహుజన రాజ్యాధికార యాత్ర రెండో విడత ప్రారంభ సభ నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు లక్ష్మీనారాయణ తారసపడటం ఈ సందర్భంగా ఇరువురు కాసేపు ముచ్చటించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ప్రవీణ్ కుమార్ పోస్ట్ చేస్తూ.. చౌటుప్పల్‌లో బహుజన రాజ్యాధికార యాత్రను ఆశీర్వదించిన పెద్దలు, స్ఫూర్తి ప్రదాత లక్ష్మీనారాయణకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. వేరు వేరు రాష్ట్రాలకు చెందిన ఇరువురు నేతలు పరస్పరం ఎదురుపడి మచ్చటించుకోవడం తెలుగు రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ ఇరువురు నేతలకు వ్యక్తిగతంగా మంచి సత్సంబంధాలు ఉన్నాయి.


ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేసి రాజకీయంలోకి వచ్చిన వారే కావడం.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు గురుకులాల అభివృద్ధి విషయంలో చూపిన చొరవపై గతంలో జేడీ ప్రశంసలు కురిపించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఏపీలో జనసేన తరపున విశాఖ లోక్ సభకు పోటీ చేసిన లక్ష్మీనారాయణ ఓటమి పాలయ్యారు. తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి తటస్థంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కలవడం చర్చనీయాంశంగా మారింది. అవసరమైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి పని చేయడానికి సైతం తాను సిద్ధంగా ఉన్నానని జేడీ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ పొలిటికల్‌గా చర్చకు దారి తీశాయి. ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరిన క్రమంలో లక్ష్మీనారాయణ సైతం బీఎస్పీలో చేరి బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఆ తర్వాత ఈ విషయం మరుగున పడింది. తాజాగా మంగళవారం ప్రవీణ్ కుమార్ యాత్రలో లక్ష్మీనారాయణ ప్రత్యక్షం కావడంతో ఇరువురు నేతలపై చర్చ హాట్ టాపిక్‌గా మారింది.


Tags:    

Similar News