బండి సంజయ్ అరెస్ట్ హేయమైన చర్య.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు.

Update: 2023-04-05 04:33 GMT

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఓ ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేకే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. పోలీసులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News