మూడు రాష్ట్రాలకు కొత్త సీఎంల ఎంపికపై కసరత్తు
దేశంలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో కాంగ్రెస్, మిజోరంలో జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. అయితే ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక మాత్రం ఇంకా జరగలేదు. ఈ క్రమంలోనే ఇవాళ బీజేపీ సీఎంల ఎంపికపై స్పీడ్ పెంచింది. ఈ సందర్భంగా బీజేపీ ఇవాళ సీఎంల ఎంపిక కోసం పరిశీలకులను నియమించింది.
రాజస్థాన్‌కు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వినోద్ తావడే, సరోజ్పాండేను నియమించింది. మధ్యప్రదేశ్‌కు హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, కే.లక్ష్మణ్, ఆశా లక్రాను ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌కు కేంద్ర మంత్రులు అర్జున్‌ముండా, సర్బానంద సోనోవాల్, దుష్యంత్గౌతమ్ను పరిశీలకులుగా నియమించింది. అయితే ఆయా రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పరిశీలకులు సమావేశమై సీఎం అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. కాగా, సీఎం అభ్యర్థులుగా ఈ రాష్ట్రాల్లో సీఎం పదవి కోసం చాలా సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు.