ఒకే నియోజకవర్గం.. ఇద్దరు రాహుల్ గాంధీలు.. ఇద్దరిపైనా అనర్హత వేటు..!

మోడీ ఇంటిపేరు వ్యవహారంలో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుతో కేరళలోని వయానాడు నుంచి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై లోక్ సభ అనర్హత వేటు వేసింది.

Update: 2023-03-31 11:20 GMT

దిశ, వెబ్ డెస్క్: మోడీ ఇంటిపేరు వ్యవహారంలో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుతో కేరళలోని వయానాడు నుంచి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై లోక్ సభ అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన తన ఎంపీ పదవిని కోల్పోయారు. కాగా వయానాడ్ నుంచే పోటీ చేసిన మరో రాహుల్ గాంధీ కూడా అనర్హత వేటుకు గురైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక విషయానికొస్తే 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయానాడ్ నుంచి ఎంపీగా పోటీ చేసి 7 లక్షల ఓట్లతో భారీ విజయాన్ని నమోదు చేశారు.

అయితే ఈ ఎన్నికల్లో వయానాడ్ స్థానం నుంచి మరో రాహుల్ గాంధీ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. అతడి పూర్తి పేరు రాహుల్ గాంధీ కేఈ. ఆయనకు ఈ ఎన్నికల్లో మొత్తం 2,196 ఓట్లు వచ్చాయి. అయితే ఎన్నికల్లో ఖర్చు పెట్టిన వివరాలను ఎన్నికల కమిషన్ కు సమర్పించని కారణంగా భారత ఎన్నికల చట్టం సెక్షన్ 10ఏ ప్రకారం రాహుల్ గాంధీ కేఈపై ఈసీ మూడేళ్లపాటు అనర్హత వేటు వేసింది. ఇక వయానాడ్ నుంచి ఈ ఇధ్దరు రాహుల్ గాంధీలే కాక మరో రాహుల్ గాంధీ (రాహుల్ గాంధీ కే) కూడా పోటీ చేశారు. ఆయనకు 845 ఓట్లు మాత్రమే వచ్చాయి. 

Tags:    

Similar News