Capital of Andhra Pradesh: మాట నిలుపుకున్న చంద్రబాబు.. తీరనున్న ఆంధ్రుల కల..

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు.

Update: 2024-06-05 11:36 GMT

దిశ వెబ్ డెస్క్: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. కాగా ఆ ఎన్నికల్లో వైసీపీ 151 యొక్క స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించింది. అయితే కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెట్టినా మునుపటి గుణము వదలదన్న సామెతకు వైసీపీ నేతలు నిదర్శనంగా నిలిచారు. ప్రజాసమస్యలపై చర్చించాల్సిన బహిరంగ సభలో ప్రతిపక్ష నేతలను వ్యక్తిగతంగా విమర్సిస్తూ అవమానించారు.

చివరికి అటు వైసులోనూ, ఇటు రాజకీయ పరిజ్ఞానంలోనూ పెద్దవారైన చంద్రబాబును సైతం పలుమార్లు అవమానించారు. ఒకానొక సంధర్భంలో అసెంబ్లీలో ఉన్నామన్న సంగతి కూడా మరిచిపోయి చంద్రబాబు కుటుంబసబ్యులపై సైతం వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో భావోద్వేగానికి గురైన చంద్రబాబు తాను మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టడమంటూ జరిగితే అది తాను సీఎం అయిన తరువాతనే అని భీష్మ శపథం చేసి అసెంబ్లీలో నుండి బయటకు వచ్చేశారు.

అలానే ఆంధ్రా రాజధాని అమరావతి అని తేల్చి చెప్పారు. అలా శపథం చేసిన అసెంబ్లీ నుండి బయటకు వచ్చిన చంద్రబాబు మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. అయితే నాడు చేసిన శపథం ప్రకారమే 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చినన్ని సీట్లు కూడా 2024 ఎన్నికల్లో వైసీపీకి రాలేదు.

జూన్ 9న అసెంబ్లీలో అడుగుపెట్టనున్న చంద్రబాబు..

తాను అసెంబ్లీలో అడుగు పెట్టడం అంటూ జరిగితే అది సీఎం అయిన తర్వాతనే అని చంద్రబాబు నాయుడు ఆనాడు చేసిన శపథాన్ని నిలుపుకోనున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

నెరవేరనున్న ఆంధ్రుల కల..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఇప్పటికీ 10 సంవత్సరాలు అయింది. అయితే దశాబ్దకాలం గడుస్తున్న నేటికి ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని గాని, ప్రత్యేక హోదా గాని లేదు. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత 2014లో మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకిరాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ నేపథ్యంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఆయన ప్రకటించడమే కాకుండా అక్కడ రాజధాని నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. అయితే ఊహించని రీతిలో 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. అలానే వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిని పక్కన పెట్టేశారు.

అలానే మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే గత ఐదేళ్లలో మూడు రాజధానుల్లో కనీసం ఒక్క రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రనాళిక రూపుదిద్దుకోలేదు. ఓవైపు రాజధాని లేదు మరోవైపు ప్రత్యేక హోదా రాలేదు. దీనితో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆంధ్రుల రాజధాని కల కలగానే మిగిలిపోయింది.

అయితే ఎవరు ఊహించని రీతిలో 2024 ఎన్నికల్లో కూటమి అత్యధిక మెజారిటీతో గెలుపొందింది. దీనితో వాడిపోయిన ఆంధ్రుల రాజధాని కల మళ్ళీ చిగురించింది. పైగా ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజీపీ టీడీపీ కూటమిలో భాగంగా ఉండడం కూడా ఆంధ్రకు కలిసి వస్తుందని అందరూ భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రకటించారని, కనుక ఆయన దాన్ని డెవలప్ చేస్తారని అందరూ ఆశిస్తున్నారు.

అలానే అమరావతి నిర్మాణం పనులు చేస్తూనే, ఆంధ్రులకు రావాల్సిన ప్రత్యేక హోదాను కూడా చంద్రబాబు నాయుడు తీసుకువస్తారని, పైగా బీజేపీ కూటమిలో భాగంగా ఉండడం చేత ఆంధ్రాకు ప్రత్యేకహోదా కచ్చితంగా వస్తుందనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నట్టు తెలుస్తోంది.


Similar News