బీఆర్ఎస్ నేతలకు మైండ్ దొబ్బింది.. కాంగ్రెస్ నేతల హాట్ కామెంట్స్

బీఆర్ఎస్ నేతలకు మైండ్ దొబ్బిందని కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు.

Update: 2024-10-23 16:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నేతలకు మైండ్ దొబ్బిందని కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ. అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ నేతలు పిచ్చిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర గోడ కట్టలేదని, బ్యూటిఫికేషన్ మాత్రమే చేస్తున్నారని తెలిపారు. ఒక మహిళ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం బందీ అయిందని సోషల్ మీడియా‌లో పెట్టారని, అందులో నిజం లేదన్నారు. పార్లమెంట్ బిల్డింగ్ లాగా అంబేద్కర్ విగ్రహం ముందు చేయాలని జీహెచ్‌ఎంసీ ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పక్కన ఉన్న దొంగలు, ఆ విగ్రహం ముందు ఉన్న గోడలు పగల కొట్టారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దళితులు అనేక విధాలుగా నష్టపోయారని వివరించారు. కేటీఆర్ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డీజీపీ‌కి కలుస్తామని అన్నారు. అంబేద్కర్ విగ్రహం కులగొట్టాలని కేటీఆర్ అనుచరులు ప్రయత్నం చేశారని వివరించారు. బీఆర్ఎస్ కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుండగా.. బీజేపీ మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

చైర్మన్ మెట్టు సాయి మాట్లాడుతూ.. ప్రజా పాలనలో ప్రజలందరికీ న్యాయం జరిగేలా సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారని, బీఆర్ఎస్ అసత్యాలతో రాజకీయం చేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం పెద్దపీఠ వేస్తున్నారని పేర్కొన్నారు. కుల గణనతో మంచి మార్పులు జరుగుతాయన్నారు. ఇందుకు ఫస్ట్ చొరవ చూపించిందే సీఎం రేవంత్‌రెడ్డి అని కొనియాడారు. కాంగ్రెస్ దళితులకు వ్యతిరేకం అనేలా బీఆర్ఎస్ అసత్య కథనాలు, వార్తలు, ప్రచారాలతో ప్రయత్నిస్తుందని, దీన్ని తప్పకుండా తిప్పికొడతామని తెలిపారు.

కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహం చుట్టూ సీకులు ఉన్నాయని, చాలా మందికి సీకులు తట్టి డ్రెస్సులు చిరిగిపోయాయని వివరించారు. బీఆర్ఎస్ నేతలు కొన్ని సంఘాలను రెచ్చకొట్టి అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న గోడను పగలకొట్టించారని పేర్కొన్నారు. మరియమ్మ, రంగయ్య లాంటి వాళ్లను విపరీతంగా కొట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పంజాగుట్ట చౌరస్తా‌లో అంబేద్కర్ విగ్రహాన్ని డంపింగ్ యార్డ్‌లో పడేశారని అన్నారు. ఇంత కంటే దారుణం మరోకటి లేదన్నారు.

ఇక బీఆర్‌ఎస్ నేత క్రిషాంక్, కేటీఆర్ కాల్ లిస్ట్ బయటికు తీయాలని ప్రీతమ్ డిమాండ్ చేశారు. దళిత సంఘాల నాయకులను రెచ్చగొట్టిన వారిని వదిలి పెట్టేది లేదన్నారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న గోడను, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు, క్రిశాంక్, బండారి తిరుపతి (కేటీఆర్ పీఏ), బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యక్తుల ప్రేరణతో కూల్చివేయడం ఎస్సీ వర్గాల మనోభావాలను గాయపరచడమే అన్నారు. వాళ్లపై కేసులు నమోదు చేయాలని అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్‌ను కలిసి ఫిర్యాదు చేశామ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మహేష్ కొనగల, అనిత జక్కని, జగదీశ్, తదితరులు పాల్గొన్నారు.


Similar News