రేపు త్రిపురకు కాంగ్రెస్, సీపీఎం ఎంపీల బృందం
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముగిసిన అనంతరం త్రిపురలో హింసాత్మక ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్: త్రిపురలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల రిజల్ట్స్ అనంతరం త్రిపురలో పలు చోట్ల హింసాత్మాక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు ప్రజలు, ప్రభుత్వ సిబ్బంది గాయపడ్డారు. కాగా బాధితులను పరామర్శించేందుకు సీపీఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రతినిధి బృందం రేపు (ఈ నెల 10న) త్రిపురలో పర్యటించనున్నట్లు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి తెలిపారు.
మొత్తం 8 మంది సభ్యులు గల ఈ బృందంలో సీపీఎం ఎంపీలు కరీం, పీఆర్ నట్రాజన్, వికాస్ రంజన్ భట్టాచార్య, ఏఏ రహీం ఉండగా.. కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎంపీలు, మాజీ ఎంపీ అజయ్ కుమార్ ఉన్నారు. ఇక సీపీఐ నుంచి బినోయ్ విశ్వం ఉన్నారు. బాధితులను పరామర్శించిన అనంతరం బృందం సభ్యులు త్రిపుర గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందజేయనున్నారు.