AP Politics: కూటమి బ్లాక్ బస్టర్.. భారీ మెజారిటీతో లోకేష్ విజయ ఢంకా

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన సూపర్ హిట్ కొట్టింది.

Update: 2024-06-05 05:46 GMT

దిశ ప్రతినిధి, గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన సూపర్ హిట్ కొట్టింది. జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 16, జనసేన ఒక నియోజకవర్గంలో విజయఢంకా మోగించింది. దీంతోపాటు జిల్లాలోని మూడు పార్లమెంటు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో 16 ఎమ్మెల్యేలను గెలుచుకున్న వైసీపీ ఇప్పుడు తుడిచి పెట్టుకుపోయింది.

జిల్లా మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజని టీడీపీ అభ్యర్థుల చేతిలో ఘోరంగా ఓడిపోయారు. నాలుగు సార్లు గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మనంద రెడ్డిపై భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. వీరితోపాటు సీనియర్, జూనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి సుచరిత కూడా ఓడిపోయారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేశ్ దాదాపు 91 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించి రాష్ట్రంలో రికార్డు నెలకొల్పారు.

పల్నాడు జిల్లాలో 33,324 ఓట్లు సాధించి అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మా రెడ్డి రికార్డు నమోదు చేసుకున్నారు. తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ మంచి మెజారిటీతో గెలుపొందారు.

గుంటూరు జిల్లాలో...

మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ 91 వేల మెజారిటీ సాధించారు. గుంటూరు తూర్పు టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్ 31,351, గుంటూరు వెస్ట్ టీడీపీ అభ్యర్థి మాధవి 49,722 , తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ 48,112, తాడికొండ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ 39 వేలు, ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు 41,151, పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర 32 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

పల్నాడు జిల్లాలో...

మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మ రెడ్డి 33,324 ఓట్లు, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 27,196, చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు 32,031, నర్సరావుపేట టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు 19 వేలు, పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ 20,480, గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు 29,100, వినుకొండ టీడీపీ అభ్యర్థి జీవీ అంజనేయులు 31,700 ఓట్లతో విజయం సాధించారు.

బాపట్ల జిల్లాలో..

బాపట్ల నుంచి వేగేశన నరేంద్ర వర్మ 27,768 ఓట్లు, వేమూరు నుంచి మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు 22,021, రేపల్లె నుంచి అనగానీ సత్య ప్రసాద్ 39,947 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించగా జిల్లాలోని మూడు పార్లమెంటు నియోజకవర్గాలు గుంటూరు, నరసరావుపేట, బాపట్ల నుంచి పెమ్మసాని చంద్ర శేఖర్ 3,44 ,695 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించిన వారిలో పెమ్మసాని రెండో వారుగా పేరు తెచ్చుకున్నారు. నరసరావుపేటకు లావు శ్రీ కృష్ణ దేవరాయలు 1,59,729 ఓట్ల మెజారిటీ, బాపట్ల ఎంపీగా తెన్నేటి కృష్ణ ప్రసాద్ 2,02941 ఓట్లతో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు.


Similar News