Sajjala: చిక్కుల్లో సజ్జల.. పలు సెక్షన్‌ల కింద క్రమినల్ కేసు నమోదు..

వైసీపీ కీలక నేత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జలు రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

Update: 2024-05-31 04:55 GMT

దిశ వెబ్ డెస్క్: వైసీపీ కీలక నేత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జలు రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లాలోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం సజ్జలు రామకృష్ణారెడ్డి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ కౌంగ ఏజెంట్లతో సమావేశమయ్యారు. ఈ సమావేసంలో సజ్జల మాట్లాడుతూ.. రూల్స్‌ను కాదనలేక వెనక్కి తగ్గే వాళ్లు ఏజెంట్లుగా వద్దు, మనమేమీ రూల్స్‌ను ఫాలో అయ్యేందుకు అక్కడికి వెళ్లటం లేదని వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు ఉపదేశించారు.

కాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. నిబంధనలు నియమాలు పాటించేవాళ్లు ఎన్నికల కౌంటింగ్‌కు వెళ్లోద్దు, టీడీపీ, జనసేన కౌటింగ్ ఏజెంట్లుమీద తిరగబడేవాళ్లు, వాళ్లతో దెబ్బలాడే వాళ్లుమాత్రమే కౌటింగ్‌కు వెళ్లాలని సజ్లల చెబుతున్నారంటే ఇతనకి చట్టం పట్ల, ఎలక్షన్ కమీషన్ నిబంధనల పట్ల ఎంత గౌరవం ఉందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.

ఇటువంటి చట్టవిరోధులని, చట్టాన్ని అతిక్రమించేవాళ్లని ఇమిడియట్‌గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.అలానే వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల మాట్లాడారని ఆరోపిస్తూ టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ, పార్టీ నేతలతో కలిసి నిన్న తాడేపల్లి సీఐకు ఫిర్యాదు చేశారు. కాగా గుడిపాటి లక్ష్మీనారాయణ, టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు సజ్జలపై ఐపీసీ సెక్షన్ 153,505 (2) IPC, 125 RPA 1951 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.


Similar News