AP Politics: ఒక్కొక్కరిది ఒక్కో మాట.. మలుపు తిరిగిన పిన్నెల్లి కేసు..?
వైసీపీ నేతల తీరు విమర్శదాయకంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.
దిశ వెబ్ డెస్క్: వైసీపీ నేతల తీరు విమర్శదాయకంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా రిమాండ్‌లో ఉన్న పిన్నెల్లి రామకృష్టా రెడ్డి వైసీపీ నేతలు విభిన్న రకాలుకా స్పంధించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని సమాచారం. తాజాగా ఈ విషయంపై టీడీపీ ట్విట్టర్ వేదికగా స్పంధించింది. ‘పేర్ని నాని వీడియో మార్ఫింగ్ అన్నాడు.. జగన్ రెడ్డి, రిగ్గింగ్ కుదరటం లేదని, మా వాడే పగలగొట్టాడు, తప్పేంటి అన్నాడు.. ఇప్పుడు పిన్నెల్లి, పోలీసుల దగ్గర, నేను అసలు ఆ పోలింగ్ బూత్ లోపలకే వెళ్ళలేదు అంటున్నాడు.. మొన్న జగన్ రెడ్డి జైలుకి వెళ్లి, ఇచ్చిన ట్రైనింగ్ ఇదే అనుకుంటా.. కేసు ఎలా సాగదీయాలి, ఎలా తప్పించుకోవాలని.’ అంటూ టీడీపీ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చింది.
కాగా పోలింగ్ జరుగుతున్న సమయంలో పిన్నెల్లి ఓ పోలింగ్ భూత్‌లోని ఈవీఎంను ధ్వంశం చేశారనే వార్త వెలుగు చూసింది. అనంతరం ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. కాగా ఆ వీడియోపై వైసీపీ నేతలు పలురకాలుగా స్పంధించారు. పిన్నెల్లిని రక్షించేందుకు యత్నించారని, అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడడంతో పిన్నెల్లి చిక్కుల్లో పడినట్టు అయిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే నేతల వ్యాఖ్యలు అటుంచితే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న పిన్నెల్లిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ అక్రమాలను అడ్డుకునేందుకే పిన్నెల్లి ఈవీఎంను పగలగొట్టారని స్పష్టం చేశారు. దీనితో పిన్నెల్లిపై నమోదైన ఈవీఎం కేసుకు జగన్ వ్యాఖ్యలు సాక్ష్యంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.