వింటే ఉంటావ్‌.. లేకుంటే పోతావ్‌..!

‘మా నాయకులు, అనుచరుల పంచాయితీ స్టేషన్లకు వస్తే సానుకూలంగా పరిశీలించాలి. తప్పెవరిదైనా మద్దతు మాకే పలకాలి. మా కులం పంచాయితీల్లోనూ అనుకూలంగా వ్యవహరించాలి. చెప్పినట్టు వింటే ఉంటావ్.. లేకుంటే బ‌దిలీపై వెళ్తావ్‌.. మా సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించుకుంటాం’ అంటూ అధికార పార్టీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. వికారాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎస్ హెచ్‌వోల బ‌దిలీల్లో రాజకీయ జోక్యం శృతిమించుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఆ శాఖ ఉన్నతాధికారికి సైతం తెలియకుండా అధికార […]

Update: 2020-12-26 00:31 GMT

‘మా నాయకులు, అనుచరుల పంచాయితీ స్టేషన్లకు వస్తే సానుకూలంగా పరిశీలించాలి. తప్పెవరిదైనా మద్దతు మాకే పలకాలి. మా కులం పంచాయితీల్లోనూ అనుకూలంగా వ్యవహరించాలి. చెప్పినట్టు వింటే ఉంటావ్.. లేకుంటే బ‌దిలీపై వెళ్తావ్‌.. మా సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించుకుంటాం’ అంటూ అధికార పార్టీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. వికారాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎస్ హెచ్‌వోల బ‌దిలీల్లో రాజకీయ జోక్యం శృతిమించుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఆ శాఖ ఉన్నతాధికారికి సైతం తెలియకుండా అధికార పలుకుబడితో బదిలీలు చేయిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది.

దిశ‌ ప్రతినిధి, రంగారెడ్డి, వికారాబాద్: తాండూరు మున్సిపల్ వ్యవహారాల్లో పోలీసుల జోక్యం ఎంత వరకు సమంజసమని మున్సిపల్ చైర్‌పర్సన్ తాటి కొండ స్వప్నపరిమల్ ఇటీవల బహిరంగాగనే విమర్శించారు. ఓ ఇంటి నిర్మాణం విషయంలో జరిగిన వివాదం నేపథ్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి పోలీసులపై ఫైర్ అయ్యారు. అక్రమ ఇంటి నిర్మాణం కూల్చివేత విషయంలో సీఐ జలంధర్ రెడ్డి మున్సిపల్ సిబ్బందిని పోలీస్ స్టేషన్‌కు పిలిచి విచారణ చేయడం ఎంతవరకు సమంజసమని చైర్​పర్సన్ నీలదీశారు. మున్సిపల్ సిబ్బంది అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తే వారి దగ్గర ఏ జీవోలు ఉన్నాయంటూ కమాండింగ్ చేయడం ఎమిటని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో వ్యవహారంలో పోలీసుల జోక్యం తగదన్నారు. మున్సిపల్ సిబ్బందిని కస్టడీలో పెడితే తనను కూడా కస్టడీలో పెట్టాలని పోలీసులను ఆమె హెచ్చరించారు. అక్రమార్కులకు పోలీసులు సపోర్ట్ చేస్తున్నారని, అక్రమ నిర్మాణాలను తాము నిలిపివేస్తుంటే సీఐ వెనకేసుకు రావడం ఏమిటని ప్రశ్నించారు. సీఐపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయం అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

ఆ అధికారి మాకొద్దు…!

జిల్లాలో ఓ మండ‌లస్థాయి ప్రజాప్రతినిధి త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన ఎస్సైనే బ‌దిలీ చేయాలంటూ భీష్మించుకూర్చున్నాడు. వేరే సామాజిక వ‌ర్గానికి చెందిన అధికారి వ‌స్తే త‌మ‌కు స‌హ‌క‌రించ‌ర‌ని అమాత్యుల‌కు సిఫార్సు చేయ‌డంపై పోలీసు అధికారులు అవాక్కవుతున్నారు. స్టేజీ ఎక్కి మైకు ప‌ట్టుకుంటే అంద‌రం స‌మాన‌మ‌ని తెగ స్పీచ్‌లు ఇస్తుంటారు. అస‌లు విష‌యానికి వ‌స్తే మాత్రం త‌క్కువ‌ సామాజిక వ‌ర్గానికి చెందిన అధికారులంటే వారికి చిన్న చూపు ఉంద‌ని పోలీసు అధికారులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. అధికారుల‌పై కూడా కుల గ‌జ్జి రుద్దుతున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఎస్‌హెచ్ఓల‌ బ‌దిలీల్లో రాజ‌కీయ జోక్యం లేకుండా చూడాలని ప‌లువురు పోలీసు అధికారులు కోరుతున్నారు.

చేవెళ్ల నియోజకవర్గం మెయినాబాద్ మండలంలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా కానుల పంపిణీ, కల్యాణలక్ష్మి, షాదీముబారాక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కాలే యాదయ్యను స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎల్ఆర్ఎస్, 111 జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి పోలీసుల తీరుపై మండిపడ్డారు. అధికారిక కార్యక్రమానికి హాజరవుతున్నామని పోలీసులకు ముందుగా సమాచారం ఇచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బహిర్గంగంగానే విమర్శించారు.

‘మా అనుచరుల పంచాయితీలు పోలీస్ స్టేష‌న్‌కు వ‌స్తే వారికి అనుకూలంగా చేయాల్సిందే. లేకుంటే ఇక్కడి నుంచి పోతావ్’ అంటూ ఎస్‌హెచ్‌వో స్థాయి పోలీసు అధికారుల‌పై ప్రజాప్ర‌తినిధులు జులుం చూపిస్తున్నారు. ఈ ప‌రిస్థితి వికారాబాద్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నెల‌కొంది. ఎస్‌హెచ్‌వో లుగా విధులు నిర్వహిస్తున్న పోలీస్​ అధికారికి ఎప్పుడు బ‌దిలీ ఆర్డర్ వ‌స్తుందో తెలియ‌ని ప‌రిస్థితి నెలకొంది. ఈ మ‌ధ్య ఎస్‌హెచ్‌వోలుగా విధులు నిర్వహిస్తున్న సీఐ, ఎస్ఐ స్థాయి పోలీసు అధికారుల బ‌దిలీలు ఉన్నతాధికారికి తెలియ‌కుండానే జ‌రిగిపోతున్నాయి. ఇదేమిట‌ని ఉన్నతాధికారి ఆరా తీస్తే బ‌దిలీల వెనుక ప్రజాప్రతినిధుల హ‌స్తం ఉన్నట్లు తెలుస్తుంది. గ‌తంలో పోలీసు శాఖలో ఎక్కువ కాలం విధులు నిర్వహించ‌డం, శాఖ ప‌ర‌మైన త‌ప్పు చేసి ఉంటే బ‌దిలీ జ‌రిగేది. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వ హ‌యాంలో ప్రజాప్రతినిధుల‌కు అనుకూలంగా లేక‌పోతే బ‌దిలీ చేస్తున్నార‌ని పోలీసు అధికారులు వాపోతున్నారు. వికారాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎస్‌హెచ్‌వోల బ‌దిలీలు ఇలానే జ‌రుగుతున్నాయ‌ని విశ్వస‌నీయ స‌మాచారం. ఇప్పటికే ఒక‌రిద్దరు అధికారుల‌కు బ‌దిలీ ఉత్తర్వులు రాగా, మ‌రికొంద‌రికి బ‌దిలీ వేటు ప‌డ‌నుంది. దీంతో బ‌దిలీ ఆర్డర్ ఎప్పుడు వ‌స్తుందోన్న ఆందోళ‌న‌లో అధికారులు ఉన్నారు.

Tags:    

Similar News