నిధుల సమీకరణ ప్రయత్నాల్లో పాలసీబజార్

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ పాలసీబజార్ దాదాపు రూ. 1,100 కోట్ల నిధులను సేకరించాలని యోచిస్తోంది. పాలసీబజార్ గ్రూప్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు యాషిస్ దహియా మాట్లాడుతూ..వ్యాపార విస్తరణకు కంపెనీకి మూలధన అవసరం లేనప్పటికీ, ఊహించని పరిస్థితుల నేపథ్యంలో ఈ నిధులను అదనంగా సేకరిస్తున్నట్టు వెల్లడించారు. ‘తాము కొంత మూలధనాన్ని అదనంగా పెంచుకోవచ్చు. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో తెలియనందున, ప్రస్తుత కొవిడ్-19 లాంటివి ఇకముందు ఎదురైతే నష్టాలను అధిగమించేందుకు […]

Update: 2020-07-19 07:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ పాలసీబజార్ దాదాపు రూ. 1,100 కోట్ల నిధులను సేకరించాలని యోచిస్తోంది. పాలసీబజార్ గ్రూప్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు యాషిస్ దహియా మాట్లాడుతూ..వ్యాపార విస్తరణకు కంపెనీకి మూలధన అవసరం లేనప్పటికీ, ఊహించని పరిస్థితుల నేపథ్యంలో ఈ నిధులను అదనంగా సేకరిస్తున్నట్టు వెల్లడించారు.

‘తాము కొంత మూలధనాన్ని అదనంగా పెంచుకోవచ్చు. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో తెలియనందున, ప్రస్తుత కొవిడ్-19 లాంటివి ఇకముందు ఎదురైతే నష్టాలను అధిగమించేందుకు దాదాపు రూ. 1,100 కోట్లను సేకరించాలని నిర్ణయించాం. ఈ నిధుల సేకరణ మూడో త్రైమాసికంలో ఉండవచ్చని ఆశిశ్ దహియా పేర్కొన్నారు. అంతేకాకుండా, కరోనా వైరస్ నేపథ్యంలో బీమాలు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభదాయకత పెంచుకోవాలని కంపెనీ ఆశిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి బీమా 70-100 శాతం వృద్ధి ఉందని ఆశీశ్ చెప్పారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లాభదాయకంగా ఉన్నప్పటికీ, 2018-19, 2019-20లలో లాభదాయకత కొనసాగించలేకపోయాం. అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నాం. దీనికోసం కంపెనీ కార్యకలాపాలను ఏకీకృతం చేసేందుకు, వినియోగదారుల సేవల కోసం పెట్టుబడులు పెట్టడానికి, మూలధన సామర్థ్యం పెంచడానికి కృషి చేస్తున్నామని ఆశీశ్ తెలిపారు. కంపెనీలోని ఇతర వ్యాపార అనుబంధ సంస్థ పైసాబజార్ కొవిడ్-19 సంక్షోభం వల్ల డిమాండ్ గణనీయంగా తగ్గినందున కొత్త ఒత్తిడి ఉందని ఆయన పెర్కొన్నారు.

Tags:    

Similar News