వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టిన పోలీస్
దిశ, నల్లగొండ: ఖాకీ అంటే కర్కశత్వం కాదు మానవత్వంతో కూడిన బాధ్యత అని నిరూపించాడు ఓ పోలీసు అధికారి. కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని కాపాడి ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. డిండి సీఐగా పని చేస్తున్న వెంకటేశ్వర్లు గురువారం విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్‌కు వెళుతున్న క్రమంలో గుర్రంపోడు శివారు తానేపల్లి గ్రామానికి చెందిన ఓర్సు సుధాకర్ (29) కుటుంబ కలహాలతో విసుగు చెంది పురుగుల మందు తాగడాన్ని […]
దిశ, నల్లగొండ: ఖాకీ అంటే కర్కశత్వం కాదు మానవత్వంతో కూడిన బాధ్యత అని నిరూపించాడు ఓ పోలీసు అధికారి. కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని కాపాడి ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. డిండి సీఐగా పని చేస్తున్న వెంకటేశ్వర్లు గురువారం విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్‌కు వెళుతున్న క్రమంలో గుర్రంపోడు శివారు తానేపల్లి గ్రామానికి చెందిన ఓర్సు సుధాకర్ (29) కుటుంబ కలహాలతో విసుగు చెంది పురుగుల మందు తాగడాన్ని గమనించాడు. వెంటనే తన వాహనాన్ని ఆపి సదరు వ్యక్తిని నల్లగొండలోని సురక్ష ఆసుపత్రిలో చేర్పించారు.