పోలీస్‌శాఖలో హాట్ టాపిక్.. మధ్యాహ్నం బదిలీ.. సాయంత్రానికే వద్దన్నారు..!
దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో ఎస్‌ఐల బదిలీ, నిలుపుదల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. గురువారం నిజామాబాద్ రేంజ్ పరిధిలో 8 మంది ఎస్‌ఐలకు స్థానచలనం కలిగిస్తూ.. ఐజీ శివశంకర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఎర్గట్ల పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓగా విధులు నిర్వహిస్తున్న ఆసీఫ్‌ను కోటగిరి ఎస్‌హెచ్‌ఓగా బదిలీ చేశారు. కానీ, ఉత్తర్వులు వెలువడిన గంటల వ్యవధిలోనే సదరు ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాలు జారీ చేశారు. […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో ఎస్‌ఐల బదిలీ, నిలుపుదల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. గురువారం నిజామాబాద్ రేంజ్ పరిధిలో 8 మంది ఎస్‌ఐలకు స్థానచలనం కలిగిస్తూ.. ఐజీ శివశంకర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఎర్గట్ల పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓగా విధులు నిర్వహిస్తున్న ఆసీఫ్‌ను కోటగిరి ఎస్‌హెచ్‌ఓగా బదిలీ చేశారు. కానీ, ఉత్తర్వులు వెలువడిన గంటల వ్యవధిలోనే సదరు ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాలు జారీ చేశారు. ఎర్గట్ల ఎస్‌ఐను అదే స్టేషన్‌లో కొనసాగించాలని స్పష్టం చేశారు. అలాగే, కామారెడ్డి జిల్లా వీఆర్, బోధన్ పోలీస్ స్టేషన్‌కు అటాచ్‌గా ఉన్న లక్ష్మయ్యనే కొనసాగించాలని.. కమిషనర్ మరో ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశం అయింది. అయితే, రాజకీయ నాయకులు కనుసన్నల్లో నడిచే అధికారులకు మాత్రమే ఎక్కడంటే అక్కడ బదిలీలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.