అర్ధరాత్రి ఆటోలో వాటి అక్రమ రవాణా.. పోలీసులు ఏంచేశారంటే..?

దిశ, ఖానాపూర్: నర్సంపేట నియోజకవర్గంలోకి గంజాయి పెద్ద మొత్తంలో రవాణా జరుగుతోంది. వరుసగా జరుగుతోన్న ఘటనలే ఇందుకు నిదర్శనం. మంగళవారం నల్లబెల్లి మండలంలో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడిన సంగతి విధితమే. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవకముందే ఖానాపూర్ మండల పోలీసులు మరో 56 కిలోల గంజాయిని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గూడూరు నుండి నర్సంపేట వైపు బుధవారం రాత్రి అనుమానాస్పదంగా ఓ ఆటో వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం చేరింది. వెంటనే అప్రమత్తమైన […]

Update: 2021-09-23 02:03 GMT

దిశ, ఖానాపూర్: నర్సంపేట నియోజకవర్గంలోకి గంజాయి పెద్ద మొత్తంలో రవాణా జరుగుతోంది. వరుసగా జరుగుతోన్న ఘటనలే ఇందుకు నిదర్శనం. మంగళవారం నల్లబెల్లి మండలంలో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడిన సంగతి విధితమే. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవకముందే ఖానాపూర్ మండల పోలీసులు మరో 56 కిలోల గంజాయిని పట్టుకున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గూడూరు నుండి నర్సంపేట వైపు బుధవారం రాత్రి అనుమానాస్పదంగా ఓ ఆటో వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం చేరింది. వెంటనే అప్రమత్తమైన ఖానాపూర్ పోలీసులు మండల శివారులోని నర్సంపేట పట్టణానికి సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద గస్తీ చేపట్టారు. అటుగా వెళ్తున్న వాహనాలకు తనిఖీ చేపట్టారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఆటోని తనిఖీ చేయగా గంజాయి పట్టుబడిది. డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అందులో 56 కిలోల గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయమై ఖానాపూర్ ఎస్సై సాయి బాబు ను వివరణ కోరగా గంజాయి పట్టుబడిన విషయం నిజమేనని, నిందితున్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. పూర్తి వివరాలు సాయంత్రం తెలియజేస్తామన్నారు.

Tags:    

Similar News