ఆ కేసులో A1 నిందితుడిగా చంద్రబాబు

దిశ, వె‌బ్‌డెస్క్ : రామతీర్థం ఆలయంలోని విగ్రహాల ధ్వంసం కేసులో ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలు ఉధృతంగా సాగిన విషయం తెలిసిందే. టీడీపీ, బీజేపీ నాయకులైతే పోటాపోటీగా నిరసనలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో రామతీర్థం ఆలయ సందర్శనకు వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి విగ్రహాల పరిశీలన అనంతరం తిరుగు ప్రయాణమయ్యే సమయంలో టీడీపీ శ్రేణులు కొందరు కారుకు అడ్డుగా అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం దీనిపై విచారణ జరిపిన పోలీసులు శుక్రవారం కోర్టుకు రిమాండ్ రిపోర్టును అందజేశారు. అందులో మాజీ […]

Update: 2021-01-22 07:57 GMT

దిశ, వె‌బ్‌డెస్క్ : రామతీర్థం ఆలయంలోని విగ్రహాల ధ్వంసం కేసులో ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలు ఉధృతంగా సాగిన విషయం తెలిసిందే. టీడీపీ, బీజేపీ నాయకులైతే పోటాపోటీగా నిరసనలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో రామతీర్థం ఆలయ సందర్శనకు వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి విగ్రహాల పరిశీలన అనంతరం తిరుగు ప్రయాణమయ్యే సమయంలో టీడీపీ శ్రేణులు కొందరు కారుకు అడ్డుగా అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం దీనిపై విచారణ జరిపిన పోలీసులు శుక్రవారం కోర్టుకు రిమాండ్ రిపోర్టును అందజేశారు.

అందులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు -ఏ1, అచ్చెన్నాయుడు-ఏ2, కళా వెంకట్రావు-ఏ3, మరో 12 మంది స్థానిక నేతలను ముద్దాయిలుగా పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఈ కేసులో ఇప్పటికే ఏడుగురికి కోర్టు రిమాండ్ విధించింది. కాగా, అదేరోజు చంద్రబాబు రామతీర్థం పర్యటన చేపట్టడంతో టీడీపీ శ్రేణులు అక్కడకు భారీగా చేరుకున్నారు. తొలుత వారిని కంట్రోల్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా.. పోలీసులు అందులో విఫలమయ్యారు. దీంతో పలు ఉద్రిక్త ఘటనలు చేసుకున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News